స్వరూపానందేశ్వర సరస్వతి స్వామి వారి జన్మదిన వేడుకలకు హాజరైన మోహన్ బాబు, పరుచూరి వెంకటేశ్వర రావు
- IndiaGlitz, [Sunday,November 11 2018]
ఫిలిం నగర్ లోని దైవసన్నిధానంలో శ్రీ శ్రీ స్వరూపానందేశ్వర సరస్వతి స్వామి వారి జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి.. ఈ సందర్భంగా జరిగిన పాత్రికేయుల సమావేశంలో మోహన్ బాబు, పరుచూరి వెంకటేశ్వర రావు, ఆలయ నిర్వాహకులు హాజరు కాగా స్వరూపానందేశ్వర సరస్వతి స్వామి వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.. అనంతరం అన్నదానం, వస్త్ర దానం జరిగాయి..
ఈ సందర్భంగా మోహన్ బాబు మాట్లాడుతూ.. అందరికి హృదయ పూర్వక నమస్కారాలు.. ఈ ఫిలిం నగర్ టెంపుల్ సినిమా నటీనటులందరి కోసం అప్పటి ప్రభుత్వం ఏర్పాటు చేసింది.. అందరి సహాయ సహకారాలతో ఈ గుడిని బ్రహ్మాండంగా నిర్మించారు.. ఇది వైజాగ్ లో ఉండే శ్రీ శ్రీ స్వరూపానందేశ్వర సరస్వతి స్వామి వారి ఆధ్వర్యంలో నడుస్తుంది..భారతేదేశంలో దాదాపు 70 దేవాలయాలు అయన ఆధ్వర్యంలో నడుస్తున్నాయి.. అంతటి వారు గనుకనే అప్పటి వారు ఈ టెంపుల్ ని అయన కు అప్పగించడం జరిగింది.. వారిద్వారా, ఫిలిం నగర్ హౌసింగ్ సొసైటీ వారి ద్వారా నాకు ఈ గుడి చైర్మన్ పదవి నాకు రావడం గొప్ప విషయం.. ఈ గుడి ఎంతో శుభ్రంగా ఉంటుంది..18 మంది దేవుళ్ళు కొలువై ఉన్నారు.. అద్భుతమైన శక్తి కలది ఈ ఫిలిం నగర్ దైవ సన్నిధానం.. ఈవిధంగా గుడిని రూపొందించిన మా సీనియర్స్ కి ధన్యవాదాలు.. ఈరోజు శారదా పీఠం శ్రీ శ్రీ స్వరూపానందేశ్వర సరస్వతి స్వామి వారి జన్మదినం.. ఆనవాయితీగా ఈ గుడి లో పనిచేసే వారికి వస్త్రదానం, కొంతమందికి అన్నదానం జరుగుతుంది.. అందుకోసం ఈ కార్యక్రమం నిర్వహించడమైంది.. ఈ టెంపుల్ అధ్యక్షుడునైన నేను , కార్యదర్శి మీ అందరి తరపున శ్రీ శ్రీ స్వరూపానందేశ్వర సరస్వతి స్వామి శుభ నమ శుభాంజలీలు తెలుపుకుంటున్నాను.. అన్నారు..
పరుచూరి వెంకటేశ్వర రావు గారు మాట్లాడుతూ.. ఈరోజు శ్రీ శ్రీ స్వరూపానందేశ్వర సరస్వతి స్వామి గారి జన్మదినం.. వారికి శుభ నమ శుభాంజలీలు.. వారి ఆశ్శిషులు మా దేవాలయానికే కాకుండా యావత్ భారతదేశానికి ఉండాలని కోరుకుంటున్నాను.. వారి ఆధ్వర్యంలో ఎన్నో దేవాలయాలు ఉన్నాయి.. వారిని విశ్వసించి ఇన్ని దేవాలయాలు అయన అద్వర్యం లో నడుస్తున్నాయంటే అయన గొప్పతనం ఏంటో తెలుసుకోవచ్చు.. వారి సలహాలు, సందేహాలు మాకు అందిస్తూ చక్కగా గుడిని నడిపిస్తున్నారు.. ఇక్కడి అర్చకులు కూడా ఎంత బాగా వేదాలను చదువుతారో మీరు చూడొచ్చు.. ఈ దేవాలయంలోని 18 మంది దేవతా ప్రతిమలను దర్శించుకుని వెళ్లాలని కోరుకుంటున్నాను.. అన్నారు.