టీఆర్ఎస్‌పై స్వామి గౌడ్ తిరుగుబావుటా.. ప్రస్తుతం ఆయన పయనమెటు?

  • IndiaGlitz, [Tuesday,August 25 2020]

శాసనమండలి చైర్మన్‌గా పదవీకాలం ముగిసిన నాటి నుంచి స్వామిగౌడ్ తిరుగు బావుటా ఎగరవేశారు. నిజానికి తెలంగాణలో అసలైన పోరాట యోధులకు స్థానం దక్కలేదని ఆరోపణలు నేటికీ తీవ్రంగా వినిపిస్తూనే ఉంటాయి. కేసీఆర్ కుటుంబానికి అడుగులకు మడుగులొత్తిన వారికే పదవుల పందేరం జరిగిందని చాలా మంది విమర్శకులు చెబుతున్న మాట. అయితే స్వామిగౌడ్‌కి మాత్రం అప్పట్లో మిగిలిన వారితో పోలిస్తే కొంతమేర న్యాయమే జరిగింది. శాసనమండలి చైర్మన్‌గా ఆయనకు కేసీఆర్ పదవిని అప్పగించారు. కానీ ఆ తరువాతే అసలు కథ మొదలైంది. ఆయన పదవి అలంకారప్రాయమైందని విమర్శలొచ్చాయి. ప్రోటోకాల్‌కి మాత్రమే పరిమితం చేశారనేది ఆది నుంచి వినబడుతున్న ప్రధాన ఆరోపణ. కేబినెట్‌లోకి తీసుకుంటారని భావించిన స్వామిగౌడ్ ఆశలకు గండి కొట్టి మండలి పదవినే అప్పగించారు. ఆ తరువాత ఆయనను కేసీఆర్ దగ్గరకు కూడా రానీయలేదని తెలుస్తోంది.

ఈ నేపథ్యంలో స్వామిగౌడ్ పరోక్ష ఆరోపణలకు తెరదీశారు. ఇటీవలి కాలంలో కూడా పెద్దగా ఆయన పార్టీ కార్యక్రమాలకు కూడా హాజరు కాని స్వామిగౌడ్.. తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ప్రతిపక్ష నేత రేవంత్‌రెడ్డిపై ప్రశంసల జల్లు కురిపించారు. వందలు, వేల కోట్లతో వచ్చే వారిని, హంతకులకు పదవులు అప్పగిస్తున్నారని.. మరీ ముఖ్యంగా ఓ సామాజిక వర్గాన్ని టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో కొన్ని కులాలకు చెందిన వారే పరిపాలన నడిపిస్తున్నారని విమర్శించారు. వందేళ్ల క్రితం ఏర్పడిన కుల రక్కసి పునాదులే నేటికీ పాలన సాగిస్తున్నాయని.. ఇది బలహీన వర్గాలపై జరుగుతున్న దాడి నఅి పేర్కొన్నారు. దేశంలో గుడి, బడి కొందరికే పరిమితమవడం, మళ్లీ పరిస్థితులు మొదటికి రావడం వల్లే నారాయణ గురును గుర్తు చేసుకుంటున్నామని ఓ కార్యక్రమంలో భాగంగా ఆయన వ్యాఖ్యానించారు.

తెలంగాణ ఉద్యోగ జేఏసీ చైర్మెన్‌గా, తెలంగాణ జేఏసీ సెక్రెటరీ జనరల్‌గా కూడా వ్యవహరించిన స్వామిగౌడ్ ఉద్యమ సమయంలో కేసీఆర్‌కు వెన్నుదన్నుగా నిలిచారు. ఉద్యమంలో తనదైన పాత్ర పోషించారు. తెలంగాణ ఉద్యమంలో ఉద్యోగులను భాగస్వాములను చేయడంలో స్వామిగౌడ్‌ పాత్ర కీలకం. అందుకే స్వామిగౌడ్‌ను మెదక్‌-నిజామాబాద్‌-ఆదిలాబాద్‌-కరీంనగర్‌ పట్టభద్రుల నియోజకవర్గం నుంచి కేసీఆర్‌ బరిలోకి దించారు. 2013లో ఆయన ఎమ్మెల్సీగా విజయం సాధించారు. తెలంగాణ ఆవిర్భావం తర్వాత శాసనమండలి తొలి చైర్మెన్‌గా స్వామిగౌడ్‌ నియమితులయ్యారు.

ప్రస్తుతం స్వామిగౌడ్ భవిష్యత్తు ప్రశ్నార్ధకంగా మారింది. కేసీఆర్‌ సముచిత గౌరవం ఇస్తామని ప్రకటించినా.. అది మాటలకే పరిమితమైంది. కాగా అసెంబ్లీ ఎన్నికల్లో రాజేంద్రనగర్‌ టికెట్‌ ఆశించినా దక్కలేదు. ఆ తర్వాత పార్లమెంటు ఎన్నికల్లో చేవెళ్ల స్థానం కావాలని అడిగినా కేసీఆర్ మొండి చెయ్యి చూపించారు. ఒక ఏడాదిగా అయితే స్వామిగౌడ్‌ను కేసీఆర్ తన దరిదాపుల్లోకి కూడా రానీయలేదని ఆరోపణలు వినవస్తున్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో స్వామి గౌడ్ ఏం చేస్తారనేది ఆసక్తికరంగా మారింది.

More News

ఎస్పీ బాలు హెల్త్ బులిటెన్‌ను విడుదల చేసిన ఎంజీఎం..

గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆరోగ్యానికి సంబంధించిన హెల్త్ బులిటెన్‌ను ఎంజీఎం ఆసుపత్రి వర్గాలు విడుదల చేశాయి.

‘ఆచార్య‌’ కాపీ రైట్ ఇష్యూ!!

ప‌లానా స్టార్ హీరో క‌థ నాదంటూ..మ‌రొక‌రు గొంతెత్త‌డం ఈ మ‌ధ్య కామ‌న్‌గా జ‌రుగుతున్న విష‌యం.

ఆ నిర్మాత‌లు లెక్క స‌రిచేస్తున్నారా?

ఇప్పుడు ఓ నిర్మాణ సంస్థ ఓ లెక్క‌ను స‌రిచేసుకునే ప్ర‌య‌త్నం చేస్తుంది. ఇంత‌కూ ఏంటా లెక్క‌? అనే వివ‌రాల్లోకెళ్తే..

‘పుష్ప‌’.. సుక్కు మ‌రో ప్లాన్‌!!

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌, విల‌క్ష‌ణ ద‌ర్శ‌కుడు సుకుమార్ కాంబినేష‌న్‌లో రూపొంద‌నున్న చిత్రం ‘పుష్ప’.

ఇన్‌టెన్స్ థ్రిల్ల‌ర్‌గా సుమంత్ క‌ప‌టధారి.. ఫ‌స్ట్ లుక్ విడుద‌ల‌

మళ్ళీరావా, సుబ్రహ్మణ్యపురం, ఇదంజ‌గ‌త్ .. ఇలా వ‌రుస హిట్ చిత్రాల‌తో హీరో సుమంత్ అంద‌రి దృష్టిని ఆక‌ర్షిస్తున్నారు.