ఎస్వీఎన్ జ్యూవెలరీ అధినేత శ్రీనివాసన్‌కు తృటిలో తప్పిన ప్రమాదం
Send us your feedback to audioarticles@vaarta.com
తమిళనాడుకు చెందిన ఎస్వీఎన్ జ్యూవెలరీ అధినేత శ్రీనివాసన్‌తో పాటు ఆయన కుటుంబానికి పెను ప్రమాదం తృటిలో తప్పింది. నేడు తిరుమల వేంకన్న దర్శనానికి శ్రీనివాసన్ తన కుటుంబంతో కలిసి హెలికాఫ్టర్‌లో కోయంబత్తూరు నుంచి బయలుదేరారు. హెలికాఫ్టర్ కుప్పం సమీపంలోని తిరుపత్తూరు వద్దకు చేరగానే అక్కడంతా పొగమంచు కమ్మేసి ఉంది.
వాతావరణం పూర్తి ప్రతికూలంగా మారడంతో హెలికాఫ్టర్ ముందుకు కదలలేని పరిస్థితి. దీంతో అక్కడే కాసేపు గాలిలో చక్కర్లు కొట్టింది. అనంతరం అత్యవసరంగా తిరుపత్తూరులోని నంగిలి వద్ద పంట పొలాల్లో హెలికాఫ్టర్ క్షేమంగా ల్యాండ్ అవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. హెలికాఫ్టర్‌లో ఇద్దరు పైలెట్లు సహా ఏడుగురు ప్రయాణిస్తున్నారు.
సమాచారం అందుకున్న తిరుపత్తూరు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. పరిస్థితులు అనుకూలించిన వెంటనే హెలికాఫ్టర్ అక్కడి నుంచి తిరుపతికి బయలు దేరింది. కాగా పొలాల్లో హెలికాఫ్టర్ దిగిన విషయాన్ని తెలుసుకున్న స్థానికులు దానిని చూసేందుకు పెద్ద ఎత్తున తరలి వచ్చారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout