నవీన్ విజయకృష్ణ హీరోగా రెండో సినిమా ప్రారంభం
Send us your feedback to audioarticles@vaarta.com
ఎస్.వి.సి.ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై నూతన చిత్రం శనివారం హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియోలో ప్రారంభమైంది. సీనియర్ నరేష్ తనయుడు నవీన్ విజయ కృష్ణ హీరోగా నటిస్తుండగా హైదరాబాద్ కు చెందిన నిత్యా నరేష్ హీరోయిన్ గా పరిచయం అవుతుంది. నూతన దర్శకుడు పివి.గిరి డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రానికి బిక్షమయ్య సంగం, రాధాకిషోర్ గుబ్బల నిర్మాతలు. తొలి సన్నివేశానికి సూపర్ స్టార్ కృష్ణ క్లాప్ కొట్టగా, సాయిధరమ్ తేజ్ కెమెరా స్విచ్చాన్ చేశారు. శ్రీమతి విజయ నిర్మల గౌరవ దర్శకత్వం వహించారు. ఈ సందర్భంగా...
సూపర్ స్టార్ కృష్ణ మాట్లాడుతూ పి.వి.గిరి దర్శకత్వంలో బిక్షమయ్య, రాధాకిషోర్ గుబ్బల నిర్మిస్తున్న ఈ చిత్రం డెఫనెట్ గా పెద్ద హిట్ అవుతుందని భావిస్తున్నాను` అన్నారు.
శ్రీమతి విజయ నిర్మల మాట్లాడుతూ నవీన్ నటిస్తున్న రెండో సినిమా ఇది. తనకు ఈ సినిమా పెద్ద సక్సెసస్ తెచ్చి పెడుతుంది. ఈ హీరోయిన్ గా నటిస్తున్ననిత్యా నరేష్ కు, దర్శక నిర్మాతలకు, యూనిట్ కు అభినందనలు` అన్నారు.
నవీన్ విజయ కృష్ణ మాట్లాడుతూ `ఇది నా సెకండ్ మూవీ. చాలా స్క్రిప్ట్స్ విని ఈ స్క్రిప్ట్ నచ్చడంతో ఎస్ చెప్పాను.గిరిగారు చెప్పిన విధానం నచ్చింది. లవ్ స్టోరి, త్వరలోనే సినిమా షూటింగ్ స్టార్ట్ చేస్తాం. మంచి ప్రొడక్షన్ టీం కుదిరింది. మంచి సినిమా రూపొందుతుందని భావిస్తున్నాను` అన్నారు.
సీనియర్ నరేష్ మాట్లాడుతూ నా తనయుడు నవీన్ గిరి అనే నూతన దర్శకుడి డైరెక్షన్ లోబిక్షమయ్య, రాధాకిషోర్ నిర్మాతలుగా సినిమా చేయడం ఆనందంగా ఉంది. చాలా ఎంటర్ టైనింగ్ సబ్జెక్ట్. శేఖర్ చంద్ర, శివేంద్ర వంటి మంచి టెక్నికల్ టీం కుదిరింది` అన్నారు.
దర్శకుడు పి.వి.గిరి మాట్లాడుతూ `చాలా సినిమాలకు రచయితగా వర్క్ చేసిన నేను ఈ సినిమా కథ చెప్పగానే నిర్మాతలు నన్నే డైరెక్ట ఛేయమని అనడంతో సరేనన్నాను. దర్శకుడిగా తొలి చిత్రం. లవ్ ఎంటర్ టైనర్. ఏప్రిల్ మొదటి నుండి సినిమా ప్రారంభమవుతుంది ` అన్నారు.
చిత్రనిర్మాతల్లో ఒకరైన బిక్షమయ్య మాట్లాడుతూ `డైరెక్టర్ గిరితో ఒకటిన్నర సంవత్సరం నుండి ట్రావెల్ అవుతున్నాం. ఏప్రిల్ మొదటి వారంలో సినిమా చిత్రీకరణ ప్రారంభమవుతుంది. మంచి టీం కుదిరింది. త్వరలోనే మిగతా వివరాలు తెలియజేస్తాం` అన్నారు.
ఈ చిత్రానికి పాటలు: రెహమాన్, డైలాగ్స్: పి.వి.గిరి, ఎ.సురేష్ బాబు, ఆర్ట్: వెంకట్ సన్నిధి, ఎడిటింగ్: కార్తీక శ్రీనివాస్, మ్యూజిక్: శేఖర్ చంద్ర, సినిమాటోగ్రఫీ: దాశరధి శివేంద్ర, నిర్మాతలు: బిక్షమయ్య సంగం, రాధాకిషోర్ గుబ్బల, కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: పి.వి.గిరి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments