యస్.వి.ఆర్ శతజయంతి వేడుకలు జులై 3న
Send us your feedback to audioarticles@vaarta.com
వెండితెర విలక్షణ నటుడు యస్.వి.ఆర్. శతజయంతి వేడుకలు జులై 3న జరగనున్నాయని `సంగమం ఫౌండేషన్ సంస్థ అధ్యక్షులు, సినీ పరిశోధకులు సంజయ్ కిశోర్ తెలిపారు. ఈ మేరకు ఆయన ఓ పత్రికా ప్రకటనను విడుదల చేశారు.
``మహానటుడు యస్.వి.రంగారావుగారి శతజయంతి సంవత్సరమిది. ఈ సందర్భంగా మా `సంగమం` సంస్థ హైదరాబాద్‌లో యస్.వి.రంగారావు శతజయంతి వేడుకలను ఘనంగా నిర్వహించనుంది. ఈ వేడుకలను రంగారావుగారి జన్మదినమైన జులై మూడో తేదీ సాయంత్రం 5 గంటలకు హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో నిర్వహిస్తాం. శ్రీ మండలి బుద్ధ ప్రసాద్‌గారు, కె.వి. రమణగార్ల నేతృత్వంలో ఏర్పాటైన ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ వేడుకలకు భారత ఉపరాష్ట్రపతి శ్రీ ఎం.వెంకయ్యనాయుడుగారు ముఖ్య అతిథిగా పాల్గొంటారు.
శతజయంతి వేడుకల సభలో యస్.వి.రంగారావుగారితో కలిసి నటించిన అలనాటి నటీనటులను సత్కరిస్తాం. అలాగే యస్.వి.ఆర్. తరువాతి తరాలలో పేరు తెచ్చుకున్న క్యారెక్టర్ నటీనటులను కూడా ప్రత్యేకంగా సత్కరిస్తాం`` అని అన్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com