య‌స్‌.వి.ఆర్ శ‌త‌జ‌యంతి వేడుక‌లు జులై 3న‌

  • IndiaGlitz, [Wednesday,June 27 2018]

వెండితెర విల‌క్ష‌ణ న‌టుడు య‌స్‌.వి.ఆర్‌. శ‌త‌జ‌యంతి వేడుక‌లు జులై 3న జ‌ర‌గ‌నున్నాయ‌ని 'సంగ‌మం ఫౌండేష‌న్ సంస్థ అధ్య‌క్షులు, సినీ ప‌రిశోధ‌కులు సంజ‌య్ కిశోర్ తెలిపారు. ఈ మేర‌కు ఆయ‌న ఓ ప‌త్రికా ప్ర‌క‌ట‌న‌ను విడుద‌ల చేశారు.

''మ‌హాన‌టుడు య‌స్‌.వి.రంగారావుగారి శ‌త‌జ‌యంతి సంవ‌త్స‌ర‌మిది. ఈ సంద‌ర్భంగా మా 'సంగ‌మం' సంస్థ హైద‌రాబాద్‌లో య‌స్‌.వి.రంగారావు శ‌త‌జ‌యంతి వేడుక‌ల‌ను ఘ‌నంగా నిర్వ‌హించ‌నుంది. ఈ వేడుక‌ల‌ను రంగారావుగారి జ‌న్మ‌దిన‌మైన జులై మూడో తేదీ సాయంత్రం 5 గంట‌ల‌కు హైద‌రాబాద్‌లోని ర‌వీంద్ర‌భార‌తిలో నిర్వ‌హిస్తాం. శ్రీ మండ‌లి బుద్ధ ప్ర‌సాద్‌గారు, కె.వి. ర‌మ‌ణ‌గార్ల నేతృత్వంలో ఏర్పాటైన ఉత్స‌వ క‌మిటీ ఆధ్వ‌ర్యంలో జ‌రుగుతున్న ఈ వేడుక‌ల‌కు భార‌త ఉప‌రాష్ట్ర‌పతి శ్రీ ఎం.వెంకయ్య‌నాయుడుగారు ముఖ్య అతిథిగా పాల్గొంటారు.

శ‌త‌జ‌యంతి వేడుక‌ల స‌భ‌లో య‌స్‌.వి.రంగారావుగారితో క‌లిసి న‌టించిన అల‌నాటి న‌టీన‌టుల‌ను స‌త్క‌రిస్తాం. అలాగే య‌స్‌.వి.ఆర్‌. త‌రువాతి త‌రాల‌లో పేరు తెచ్చుకున్న క్యారెక్ట‌ర్ న‌టీన‌టుల‌ను కూడా ప్ర‌త్యేకంగా స‌త్క‌రిస్తాం'' అని అన్నారు.