సెన్సార్ కార్యక్రమాల్లో 'సువ‌ర్ణ‌సుంద‌రి'

  • IndiaGlitz, [Monday,February 25 2019]

జయప్రద, పూర్ణ, సాక్షి చౌదరి ప్రధాన పాత్రల్లొ తెరకెక్కుతొన్న చిత్రం సువర్ణసుందరి. సూపర్ నేచురల్ థ్రిల్లర్ గా దర్శకుడు సూర్య ఎమ్.ఎస్.ఎన్ తెరమీదకు తీసుకు వస్తున్నారు. చరిత్ర భవిష్యత్తుని వెంటాడుతొందన్న క్యాప్షన్ తో భారీ బడ్జెట్ చిత్రాలకు ఏ మాత్రం తీసిపోని రీతిలొ ఓ సాంకేతిక అద్బుతంగా ఎస్.టీమ్ పిక్చర్స్ పతాకంపై ఎమ్.ఎల్. లక్ష్మి నిర్మిస్తున్న ఈ చిత్రం మార్చిలొనె ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇటీవలె‌ విడుదలైన థియెరటికల్ ట్రైలర్ కు మిలియన్ వ్యూస్ లభించాయి.

ఈ సందర్బంగా డైరెక్ట‌ర్ సూర్య మాట్లాడుతూ... సువర్ణ సుందరి చిత్రంలో ఎఫ్ఎక్స్ కోసం ఏడాదిపాటు వ‌ర్క్ జ‌రిగింది. లేటు అయినా కూడా ఫ‌లితం చాలా బాగా వ‌చ్చింది. దానికి నిదర్శనం మా చిత్ర ట్రైలర్ ‌కు వచ్చిన రెస్పాన్స్ . సాధారణ ప్రేక్షకుల నుంచి సెలబ్రిటీల వరకు ఈ సినిమా ట్రైలర్ ఆకట్టుకుంది. మూడు జన్మల కాన్సెప్ట్ తో హిస్టారికల్ థ్రిల్లర్ గా తీసిన ఈ చిత్రం సెన్సార్ కు సిద్దమయింది. మార్చి తొలివారంలో పాటలను రెండొ వారంలొ సినిమాను తెలుగు ,కన్నడ ,తమిళ్ భాషల్లొ ఒకేసారి విడుదల చెయటానికి నిర్మాత సన్నాహాలు చెస్తున్నారన్నారు.

జ‌య‌ప్ర‌ద‌, పూర్ణ‌, సాక్షి, ఇంద్ర‌, రామ్, సాయికుమార్‌, కోటాశ్రీ‌నివాస‌రావు, ముక్త‌ర్‌ఖాన్‌, నాగినీడు, స‌త్య‌ప్ర‌కాష్‌, అవినాష్ న‌టిస్తున్న ఈ చిత్రానికి ప్రొడ్యూస‌ర్ఃఎం.ఎల్‌.ల‌క్ష్మి, మ్యూజిక్‌డైరెక్ట‌ర్ఃసాయికార్తిక్‌, స్టంట్స్ఃరామ్‌సుంక‌ర‌, ఆర్ట్ డైరెక్ట‌ర్ఃనాగు, డి.ఓ.పి. ఎల్లుమహంతి, ఎడిట‌ర్ఃప్ర‌వీణ్‌పూడి, స్టోరీఃఎం.ఎస్‌.ఎన్.సూర్య‌, పి.ఆర్‌.ఓ. సాయిస‌తీష్‌, డైరెక్ట‌ర్ఃఎం.ఎస్‌.ఎన్‌.సూర్య‌.

More News

ఆస్కార్ ద‌క్కించుకున్న భార‌తీయ చిత్రం

ఆస్కార్ అవార్డుల్లో భార‌తీయ సినిమాకు అవార్డు ద‌క్కింది. హీరోయిజం, గ్లామ‌ర్ అనే అంశాల‌కు కాకుండా క‌థ‌కు ప్రాధాన్య‌మిచ్చి రూపొందిన చిత్రం

ప్రజలు ఓట్లు వేసినా.. వేయకపోయినా అండగా ఉంటా!

కర్నూలు జిల్లా విద్యార్థులతో జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా పలు కాలేజీలకు చెందిన విద్యార్థినీ విద్యార్థులు పలు సమస్యలను పవన్ దృష్టికి తీసుకొచ్చారు.

బాల్కసుమన్-పద్మారావ్.. ఔర్ ఏక్ ప్రేమ్ కహానీ!!

తెలంగాణ శాసనసభ డిప్యూటీ స్పీకర్‌గా ఎన్నికైన ఎమ్మెల్యే పద్మారావు గౌడ్‌కు సీఎం కేసీఆర్ మొదలుకుని ప్రతిపక్షనేత భట్టీ విక్రమార్క, కేటీఆర్,

షారూక్ స్థానంలో కౌశ‌ల్‌...

భార‌త‌దేశం త‌రపున తొలిసారి చంద్రునిపై కాలు పెట్టిన వ్యోమ‌గామి రాకేష్ శ‌ర్మ బ‌యోపిక్‌ను తెర‌కెక్కించ‌డానికి స‌న్నాహాలు ప్రారంభ‌మైయ్యాయి.

జ‌పాన్‌కు ప్ర‌భాస్‌, అనుష్క‌

యంగ్ రెబ‌ల్‌స్టార్ ప్ర‌భాస్‌కు అంత‌ర్జాతీయ స్థాయిలో పేరు సంపాదించి పెట్టిన చిత్రం `బాహుబ‌లి`.