Rajasingh:గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్‌పై సస్పెన్షన్ ఎత్తివేత.. ఎమ్మెల్యేగా పోటీ..?
Send us your feedback to audioarticles@vaarta.com
గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్‌కు బీజేపీ అధిష్టానం శుభవార్త అందించింది. ఏడాదిన్నరగా ఆయనపై ఉన్న నిషేధాన్ని ఎత్తివేస్తున్నట్లు ఆ పార్టీ క్రమశిక్షణ సంఘం వెల్లడించింది. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది. ఆగస్టు 23, 2022న ఓ వర్గంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని రాజసింగ్‌పై బీజేపీ సస్పెన్షన్ విధించింది. ఈ వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాలంటూ గతంలో రాజాసింగ్‌కు పార్టీ హైకమాండ్ షోకాజ్ నోటీసు ఇచ్చింది. దానికి ఆయన ఇచ్చిన వివరణ పట్ల సంతృప్తి చెందిన అధిష్టానం తాజాగా సస్పెన్షన్ ఎత్తివేస్తూ నిర్ణయం తీసుకుంది.
55 మందితో తొలి జాబితా విడుదలయ్యే ఛాన్స్..
మరోవైపు తెలంగాణ బీజేపీ అభ్యర్థుల తొలి జాబితా ఇవాళ విడుదల చేసే అవకాశం ఉంది. 55 మంది అభ్యర్థులతో ఫస్ట్ లిస్ట్ విడుదల చేయనున్నట్లు బీజేపీ సీనియర్ నేతలు చెబుతున్నారు. ఈసారి బీసీలకు అధిక ప్రాధాన్యమిచ్చామని తొలి జాబితాలో 20కు పైగా సీట్లు కేటాయించినట్లు వెల్లడిస్తున్నారు. గత కొన్ని రోజులుగా గోషామహల్ నుంచి బీజేపీ అభ్యర్థిగా తాను పోటీ చేయనున్నట్లు రాజాసింగ్ ప్రకటిస్తూ వస్తున్నారు. తాజాగా అధిష్టానం ఆయనపై ఉన్న సస్పెన్షన్ ఎత్తివేయడంతో గోషామహల్ టికెట్ రాజాసింగ్‌కే కేటాయించినట్లు తెలుస్తోంది.
2018లో గెలిచిన ఏకైక బీజేపీ ఎమ్మెల్యే..
కాగా టీడీపీ నుంచి కార్పొరేటర్‌గా రాజకీయ జీవితం ప్రారంభించిన రాజాసింగ్.. 2014లో బీజేపీలో చేరారు. గోషామహల్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఇక 2018లో జరిగిన ఎన్నికల్లో బీజేపీ నుంచి కేవలం రాజాసింగ్ మాత్రమే ఎమ్మెల్యేగా గెలిచారు. అక్కడ హిందువుల ఓట్లు ఎక్కువగా ఉండటం.. ఆయన కూడా హిందూ ధర్మం కోసం పోరాటం చేస్తాన పక్కా హిందూత్వవాదిగా ముద్రపడ్డారు. దీంతో రాజాసింగ్‌కు గోషామహల్ నుంచి గెలుపు అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని చెబుతున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout