రజినీ రాజకీయ రంగ ప్రవేశంపై కొనసాగుతున్న సస్పెన్స్..
Send us your feedback to audioarticles@vaarta.com
సూపర్ స్టార్ రజినీకాంత్ రాజకీయం రంగ ప్రవేశం దాదాపుగా ఖరారై పోయింది. అయితే ఆయన ఇవాళే పార్టీని ప్రకటిస్తారన్న ఆశించిన అభిమానులకు నిరాశే ఎదురైంది. సోమవారం ఆయన తన అభిమాన సంఘాల నాయకులతో చెన్నైలోని రాఘవేంద్ర కల్యాణ మండపంలో సమావేశమయ్యారు. ఈ సమావేశంలోనే రజనీకాంత్ సొంత పార్టీపై కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. రాజకీయ ప్రవేశంపై వీలైనంత త్వరలో తన నిర్ణయాన్ని ప్రకటిస్తానని వెల్లడించారు. మొత్తానికి రజినీ రాజకీయాల్లోకి వస్తారనే అనిపిస్తోంది కానీ రావట్లేదు. సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది.
సమావేశానంతరం రజినీ మీడియాతో మాట్లాడుతూ.. మక్కల్ మండలం కార్యదర్శులు, నిర్వాహకులు తమ తరుఫు నుంచి లోటుపాట్లను వివరించగా.. తాను సలహాలిచ్చినట్టు వెల్లడించారు. రాజకీయాలపై వీలైనంత త్వరగా నిర్ణయాన్ని ప్రకటిస్తామన్నారు. దీంతో ఆయన రాజకీయ ప్రవేశం గురించిన ప్రకటన నేడు తప్పక వస్తుందని ఆశించిన అభిమానులకు నిరాశ ఎదురైంది. అయితే సమావేశంలో రజినీ మాట్లాడిన కొన్ని విషయాలు బయటకు వచ్చాయి. దీనిని బట్టి రజినీ రాజకీయ రంగ ప్రవేశం ఖాయంగానే కనిపిస్తోంది.
జనవరిలో పార్టీ ప్రారంభిస్తే మీరు రెడీగా ఉన్నారా? అని అభిమానులను రజినీ ప్రశ్నించినట్టు తెలుస్తోంది. కొన్ని జిల్లాల అధ్యక్షుల పనితీరు ఏమాత్రం బాగోలేదన్నట్టు సమాచారం. మీరు కష్టపడితేనే మనం తరువాతి మెట్టు ఎక్కగలమన్నట్టు తెలుస్తోంది. అయితే బీజేపీతో పొత్తు ఉండాలా? వద్దా? అన్న విషయంలో మాత్రం సూపర్ స్టార్ ఓ నిర్ణయానికి ఇంకా రాలేదని సమాచారం. అయితే ఈ సమావేశం జరుగుతుండగానే సమావేశ మందిరం బయట ఉన్న అభిమానులు మాత్రం బీజేపీతో పొత్తు వద్దంటూ నినాదాలు చేయడం గమనార్హం.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout