ఈ వయసులో కూడా తప్పు చేశా.. లవ్ బ్రేకప్ పై సీనియర్ హీరోయిన్
Send us your feedback to audioarticles@vaarta.com
మాజీ విశ్వసుందరి సుస్మితా సేన్ బాలీవుడ్ లో ఓ వెలుగు వెలిగిన నటి. ప్రస్తుతం సుస్మితాసేన్ వయసు 45 ఏళ్ళు. అయితే ఆమె ఇంతవరకు పెళ్లి చేసుకోలేదు. వివాహబంధంలోకి అడుగుపెట్టే ఉద్దేశం కూడా ఆమెకు లేనట్లుంది. చాలాకాలంగా సుస్మిత ఇద్దరు పిల్లలని దత్తత తీసుకుని పెంచుకుంటున్న సంగతి తెలిసిందే.
అయితే ఆమెలో లేటు వయసులో ప్రేమ చిగురించింది. గత రెండేళ్లుగా రొహ్మాన్ అనే యువ పాతికేళ్ల యంగ్ మోడల్ తో ఆమె సహజీవనం చేస్తోంది. వీరిద్దరి మధ్య ఏజ్ గ్యాప్ చూసి అంతా ఆశ్చర్యం వ్యక్తం చేశారు. అయినప్పటికీ ఈ జంట పబ్లిక్ గా తిరుగుతూ తమ రిలేషన్ కొనసాగించారు.
ఇదీ చదవండి: కండోమ్ కథలో బోల్డ్ గా.. హింట్స్ ఇస్తున్న రకుల్
ఏజ్ గ్యాప్ ఉన్నప్పటికీ ఈ జంట బాగా సెట్ ఐపోయారనుకుంటున్న తరుణంలో బ్రేకప్ న్యూస్ వచ్చింది. రోహ్మాన్, సుస్మిత విడిపోయినట్లు తేలింది. ప్రస్తుతం సుస్మిత మనో వేదన అనుభవిస్తున్నారు. ఆమె ఇన్స్టాగ్రామ్ పోస్ట్ చూస్తే ఇదే అర్థం అవుతుంది. తన బ్రేకప్ గురించి సుస్మిత పరోక్షంగా వ్యాఖ్యలుచేశారు.
'అన్ని సమయాల్లో నేను పాజిటివ్ గా ఆలోచిస్తానని అంతా అనుకుంటారు. కానీ అది నిజం కాదు. 45 ఏళ్ల వయసులో కూడా నేను పొరపాటు చేశా. దాని ఫలితం అనుభవిస్తున్నా. ఇందులో తప్పు ఎవరిది అని లెక్కలేసుకుంటూ కుర్చోను. తప్పు చేసిన వారు కర్మ నుంచి తప్పించుకోలేరు అని సుస్మిత కర్మ సిద్ధాంతం చెప్పుకొచ్చింది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments