ఈ వయసులో కూడా తప్పు చేశా.. లవ్ బ్రేకప్ పై సీనియర్ హీరోయిన్

  • IndiaGlitz, [Wednesday,May 26 2021]

మాజీ విశ్వసుందరి సుస్మితా సేన్ బాలీవుడ్ లో ఓ వెలుగు వెలిగిన నటి. ప్రస్తుతం సుస్మితాసేన్ వయసు 45 ఏళ్ళు. అయితే ఆమె ఇంతవరకు పెళ్లి చేసుకోలేదు. వివాహబంధంలోకి అడుగుపెట్టే ఉద్దేశం కూడా ఆమెకు లేనట్లుంది. చాలాకాలంగా సుస్మిత ఇద్దరు పిల్లలని దత్తత తీసుకుని పెంచుకుంటున్న సంగతి తెలిసిందే.

అయితే ఆమెలో లేటు వయసులో ప్రేమ చిగురించింది. గత రెండేళ్లుగా రొహ్మాన్ అనే యువ పాతికేళ్ల యంగ్ మోడల్ తో ఆమె సహజీవనం చేస్తోంది. వీరిద్దరి మధ్య ఏజ్ గ్యాప్ చూసి అంతా ఆశ్చర్యం వ్యక్తం చేశారు. అయినప్పటికీ ఈ జంట పబ్లిక్ గా తిరుగుతూ తమ రిలేషన్ కొనసాగించారు.

ఇదీ చదవండి: కండోమ్ కథలో బోల్డ్ గా.. హింట్స్ ఇస్తున్న రకుల్

ఏజ్ గ్యాప్ ఉన్నప్పటికీ ఈ జంట బాగా సెట్ ఐపోయారనుకుంటున్న తరుణంలో బ్రేకప్ న్యూస్ వచ్చింది. రోహ్మాన్, సుస్మిత విడిపోయినట్లు తేలింది. ప్రస్తుతం సుస్మిత మనో వేదన అనుభవిస్తున్నారు. ఆమె ఇన్స్టాగ్రామ్ పోస్ట్ చూస్తే ఇదే అర్థం అవుతుంది. తన బ్రేకప్ గురించి సుస్మిత పరోక్షంగా వ్యాఖ్యలుచేశారు.

'అన్ని సమయాల్లో నేను పాజిటివ్ గా ఆలోచిస్తానని అంతా అనుకుంటారు. కానీ అది నిజం కాదు. 45 ఏళ్ల వయసులో కూడా నేను పొరపాటు చేశా. దాని ఫలితం అనుభవిస్తున్నా. ఇందులో తప్పు ఎవరిది అని లెక్కలేసుకుంటూ కుర్చోను. తప్పు చేసిన వారు కర్మ నుంచి తప్పించుకోలేరు అని సుస్మిత కర్మ సిద్ధాంతం చెప్పుకొచ్చింది.

More News

కండోమ్ కథలో బోల్డ్ గా.. హింట్స్ ఇస్తున్న రకుల్

స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ సౌత్ లో పలువురు స్టార్స్ తో ఆడిపాడింది. ప్రస్తుతం రకుల్ బాలీవుడ్ లో రాణించేందుకు ప్రయత్నిస్తోంది. ఇప్పటికే రకుల్ 'దే దే ప్యార్ దే'

హాలీవుడ్ బ్లాక్ బస్టర్ సిరీస్ లో ప్రభాస్.. యాక్షన్ హీరోతో కలసి..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఖ్యాతి రోజు రోజుకు ప్రపంచ వ్యాప్తం అవుతోంది. బాహుబలితో ప్రభాస్ ఇప్పటికే ఇండియా మొత్తం సూపర్ క్రేజ్ సొంతం చేసుకున్నారు.

మెగాస్టార్ మాటిచ్చాడంటే.. నిలబడతాడంతే..

సేవాభావానికి ప్రతిరూపం మెగాస్టార్ చిరంజీవి. ఈ విషయం ఎప్పటికప్పుడు ప్రూవ్ అవుతూనే ఉంది. ముఖ్యంగా ఈ కరోనా కష్ట కాలంలో చిరంజీవి ఆపదలో ఉన్నవారిని ఆదుకునేందుకు

ఆల్మోస్ట్ చనిపోయా.. బెంబేలెత్తిపోయిన నటుడు!

క్రేజీ హీరో హృతిక్ రోషన్ రిస్కీ స్టంట్స్ చేసేందుకు ఎప్పుడూ సిద్ధంగా ఉంటాడు. అందుకే హృతిక్ నటించే చిత్రాల్లో యాక్షన్ సీన్స్ అంత అద్భుతంగా ఉంటాయి.

ఆనందయ్యపై జగపతిబాబు కామెంట్స్

నెల్లూరు జిల్లా కృష్ణపట్నంకు చెందిన ఆనందయ్య ప్రస్తుతం నేషనల్ ఫేమస్. ఆయన కరోనా రోగులకు ఇస్తున్న మందు బాగా పనిచేస్తోందని జనాల నుంచి ఫీడ్ బ్యాక్ వస్తున్న సంగతి తెలిసిందే.