‘చిన్నమ్మ’ సుష్మా చివరి ట్వీట్ ఇదే...
- IndiaGlitz, [Wednesday,August 07 2019]
బీజేపీ సీనియర్ నేత, ప్రధాని నరేంద్ర మోదీ తర్వాత అంత ప్రజాధరణ కలిగిన సుష్మా స్వరాజ్ గుండెపోటుతో హఠాన్మరణం చెందారు. చిన్నమ్మ మృతితో యావత్ భారతావని శోకసంద్రంలో మునిగిపోయింది. నిత్యం ప్రజా సమస్యలపై పోరాడుతూ.. అడిగిన వారికి సాయం చేసే చిన్నమ్మ మరణ వార్త బీజేపీకి కోలుకోలేని షాక్ అని చెప్పుకోవచ్చు. మంగళవారం నాడు జమ్ముకశ్మీర్ విభజన బిల్లును లోక్సభ ఆమోదించిన విషయం విదితమే. ఈ బిల్లు ఆమోదం అనంతరం మోదీ సర్కార్ను అభినందిస్తూ సుష్మా ట్వీట్ చేశారు. ఇదే చిన్నమ్మ చివరి ట్వీట్ కావడం గమనార్హం.
చిన్నమ్మ చివరి ట్వీట్ సారాంశం ఇదీ..
థ్యాంక్యూ ప్రైమ్ మినిస్టర్ మోదీజీ. థ్యాంకూ వెరిమచ్. నా జీవితంలో ఇలాంటి రోజు కోసమే ఎదురుచూస్తున్నాను అంటూ ట్వీట్లో పేర్కొన్నారు. మరో ట్వీట్లో ఈ బిల్లు ప్రవేశపెట్టిన సమయంలో హోం మంత్రి అమిత్ షా హుందాగా ప్రవర్తించారని సుష్మా స్వరాజ్ ప్రశంసించారు. కాగా మోదీపై ట్వీట్ చేసిన అనంతరం ఆమె తీవ్ర అస్వస్థతకు లోనుకావడం ఐదుగురు డాక్టర్ల బృందం రంగంలోకి సాయశక్తులా ప్రయత్నాలు చేసినప్పటికీ సుష్మాను కాపాడలేకపోయారు.
प्रधान मंत्री जी - आपका हार्दिक अभिनन्दन. मैं अपने जीवन में इस दिन को देखने की प्रतीक्षा कर रही थी. @narendramodi ji - Thank you Prime Minister. Thank you very much. I was waiting to see this day in my lifetime.
— Sushma Swaraj (@SushmaSwaraj) August 6, 2019