రియాకు సుశాంత్ సోదరి స్ట్రాంగ్ కౌంటర్..
Send us your feedback to audioarticles@vaarta.com
బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మృతి కేసు విషయంలో రోజుకో కొత్త విషయం బయటకు వస్తోంది. తాజాగా సుశాంత్ ప్రియురాలు రియా చక్రవర్తి సుశాంత్ కుటుంబంపై ఆరోపణలు గుప్పించింది. తాజాగా ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ ఆరోపణలు చేసింది. సుశాంత్ కుటుంబం అతనికి దూరంగా ఉండేదని, తండ్రితోనూ, సోదరితోనూ సుశాంత్‌కు విభేదాలు ఉండేవని రియా తెలిపింది.
రియా వ్యాఖ్యలపై సుశాంత్ సోదరి శ్వేతా సింగ్ మండిపడ్డారు. సోషల్ మీడియా వేదికగా రియాకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. రియా ఇంటర్వ్యూలో పేర్కొన్నట్టు తమ సోదరుడంటే తమకు ప్రేమ లేదు.. నిజమేనని.. అందుకే అమెరికా నుంచి ఇండియాకు వచ్చానని శ్వేతా సింగ్ తెలిపారు. ఈ ఏడాది జనవరిలో తాను అమెరికా నుంచి భారత్‌కు వచ్చానని తెలిపారు. దానికి సంబంధించిన విమానం టికెట్‌ను కూడా ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. తన సోదరుడు చంఢీగఢ్ వెళ్తున్నాడని తెలిసి అమెరికాలో తన బిజినెస్‌ను, పిల్లలను వదిలేసి ఇక్కడకు వచ్చానని శ్వేత తెలిపారు. అయితే ఆ పర్యటనలో తాను తన సోదరుడిని కలుసుకోలేకపోయానన్నారు. తాను వచ్చే సమయానికే రియా నుంచి వచ్చిన వరుస ఫోన్ కాల్స్ వల్ల, షూటింగ్‌ల వల్ల తన సోదరుడు వెళ్లిపోయాడని వివరించారు. సుశాంత్ కోసం అతని ఫ్యామిలీ మొత్తం పోరాడుతోందని శ్వేత వెల్లడించారు.
కాగా.. రియా చక్రవర్తికి సమన్లు జారీ చేయడంతో ఆమె ఈ రోజు ఉదయం ముంబైలోని డీఆర్డీవో అతిథి గృహానికి వచ్చింది. అక్కడే సీబీఐ అధికారులు ఆమెను ప్రశ్నిస్తున్నారు. ఆమెతో పాటు సుశాంత్ స్నేహితుడు సిద్ధార్థ్ పితానిని కూడా సీబీఐ అధికారులు మరోసారి ప్రశ్నించనున్నారు. నిన్న రియా సోదరుడితో పాటు, సుశాంత్ సింగ్ కుటుంబ సభ్యులను కూడా అధికారులు విచారించారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments