'చిలసౌ' ఫస్ట్ లుక్ విడుదల

  • IndiaGlitz, [Saturday,March 17 2018]

సుశాంత్ కథానాయకుడిగా సిరుని సినీ కార్పొరేషన్ పతాకంపై రాహుల్ రవీంద్రన్ దర్శకుడిగా పరిచయమవుతూ తెరకెక్కిస్తున్న చిత్రం చి ల సౌ. ఈ చిత్రాన్ని జస్వంత్ నడిపల్లి నిర్మిస్తున్నారు. సుశాంత్ సరసన రుహాని శర్మ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్ ను రేపు (మార్చి 18) చిత్ర కథానాయకుడు సుశాంత్ పుట్టినరోజు సందర్భంగా నేడు విడుదల చేశారు.

ఈ సందర్భంగా చిత్ర నిర్మాత జస్వంత్ నడిపల్లి మాట్లాడుతూ.. సుశాంత్ హీరోగా చిలసౌ చిత్రాన్ని నిర్మిస్తూ చిత్ర పరిశ్రమకు నిర్మాతగా ఇంట్రడ్యూస్ అవ్వడం చాలా ఆనందంగా ఉంది. ప్రామిసింగ్ ఫిలిమ్ గా రాహుల్ రవీంద్రన్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. రేపు మా హీరో సుశాంత్ పుట్టినరోజు సందర్భంగా ఇవాళ మా సినిమా ఫస్ట్ లుక్ ను విడుదల చేయడం ఆనందంగా ఉంది. షూటింగ్ పూర్తై ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటోంది. మే 11న చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం అన్నారు. 

సుశాంత్, రుహాని శర్మ, వెన్నెల కిషోర్, రోహిణి, అనుహాసన్, రాహుల్ రామకృష్ణ, జయప్రకాష్, విద్యుల్లేఖ, సంజయ్ స్వరూప్, హరీష్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి ప్రొడక్షన్ కంట్రోలర్స్: రవికుమార్ యండమూరి-వాసిరెడ్డి, చీఫ్ కో డైరెక్టర్: డి.సాయికృష్ణ, ఆర్ట్ డైరెక్టర్: వినోద్ శర్మ (వివి), ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: హరీష్ కోయలగుండ్ల, ఎడిటర్: ఛోటా కె.ప్రసాద్, మ్యూజిక్ డైరెక్టర్: ప్రశాంత్ ఆర్.విహారి, సినిమాటోగ్రఫీ: ఎం.సుకుమార్, నిర్మాత: జస్వంత్ నడిపల్లి, దర్శకత్వం: రాహుల్ రవీంద్రన్.

More News

ఏప్రిల్ 6న 'ఇంతలో ఎన్నెన్ని వింతలో' విడుదల

నందు కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం “ఇంతలో ఎన్నెన్ని వింతలో”.హరిహర చలన చిత్ర సంస్థ ఈ సినిమాను నిర్మిస్తోంది.

రెండు వారాల పాటు 'శ్రీ‌నివాస క‌ళ్యాణం' తొలి షెడ్యూల్‌

నితిన్, రాశి ఖన్నా జంటగా సక్సెస్‌ఫుల్‌ ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మాణంలో తెరకెక్కుతున్న చిత్రం ‘శ్రీనివాస కళ్యాణం’.

గోపీచంద్ 'పంతం' ఫ‌స్ట్‌లుక్ అప్‌డేట్‌

యాక్షన్ హీరోగా పలు విజయవంతమైన చిత్రాల్లో నటించిన గోపీచంద్‌కు ‘జిల్’ (2015) సినిమాతో విజయాలకు బ్రేక్ పడింది.

మనం సైతం టీషర్టు ఆవిష్కరించిన తమన్నా

నిస్సహాయులకు అండగా నిలుస్తున్న మనం సైతం సంస్థ కార్యక్రమాలను ప్రముఖ నాయిక తమన్నా అభినందించారు.

ఒకే చిత్రంలో నిత్యా, సాయి ప‌ల్ల‌వి?

ప్రస్తుతం సౌత్ ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలలో నటనా ప్రాధాన్యమున్న పాత్రలు చేయాలంటే దర్శకనిర్మాతల చూపు ఆ ఇద్దరి నటీమణుల వైపే ఉంటుంది.