సుశాంత్, జి.నాగేశ్వరరెడ్డిల 'ఆటాడుకుందాం..రా' టాకీ పూర్తి
Send us your feedback to audioarticles@vaarta.com
కాళిదాసు, కరెంట్, అడ్డా వంటి సూపర్‌హిట్ చిత్రాల హీరో సుశాంత్ కథానాయకుడిగా అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో శ్రీనాగ్ కార్పోరేషన్, శ్రీ జి ఫిలింస్ పతాకాలపై జి.నాగేశ్వరరెడ్డి దర్శకత్వంలో చింతలపూడి శ్రీనివాసరావు, ఎ.నాగసుశీల నిర్మిస్తున్న యాక్షన్ ఎంటర్‌టైనర్ 'ఆటాడుకుందాం.. రా'(జస్ట్ చిల్). ఈ చిత్రానికి సంబంధించి పాటలు మినహా టాకీ, యాక్షన్ పార్ట్స్ పూర్తయ్యాయి. ఈ చిత్రంలోని కొన్ని ముఖ్యమైన కామెడీ సీన్స్ కోసం 60 లక్షల రూపాయల భారీ వ్యయంతో అన్నపూర్ణ సెవన్ ఎకర్స్‌లో టైమ్ మెషీన్ సెట్‌ను వేశారు. ప్రస్తుతం ఈ సెట్‌లో బ్రహ్మానందం కాంబినేషన్‌లో కొన్ని కామెడీ సీన్స్‌ని చిత్రీకరిస్తున్నారు. ఈ సందర్భంగా హైదరాబాద్‌లోని అన్నపూర్ణ సెవన్ ఎకర్స్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో హీరో సుశాంత్, డైరెక్టర్ జి.నాగేశ్వరరెడ్డి, రచయిత, శ్రీధర్ సీపాన, నిర్మాతలు చింతలపూడి శ్రీనివాసరావు, ఎ.నాగసుశీల పాల్గొన్నారు.
హీరో సుశాంత్ మాట్లాడుతూ - ''శ్రీధర్ సీపాన మంచి కథ ఇచ్చాడు. చాలా రోజుల తర్వాత మంచి కథ సెలెక్ట్ చేసుకొని ఈ సినిమా చేస్తున్నాను. ఈ క్యారెక్టర్ నాకు చాలా కొత్తగా వుంటుంది. నాగేశ్వరరెడ్డిగారు ఎంటర్‌టైన్‌మెంట్ సీన్స్‌ని బాగా చిత్రీకరించారు. బ్రహ్మానందంగారితో నేను చేసిన కామెడీ సీన్స్ అన్నీ ప్రేక్షకుల్ని బాగా నవ్విస్తాయి. అన్నివర్గాల ప్రేక్షకులు మెచ్చే సినిమా ఇది. అందరూ బాగా ఎంజాయ్ చేస్తారు'' అన్నారు.
రచయిత శ్రీధర్ సీపాన మాట్లాడుతూ - ''నన్ను రైటర్‌గా ఇంట్రడ్యూస్ చేసిన నాగేశ్వరరెడ్డిగారికి నా కృతజ్ఞతలు. సుశాంత్ చేస్తున్న ఈ సినిమా చాలా డిఫరెంట్‌గా వుంటుంది. నాగేశ్వరరెడ్డిగారు ఫస్ట్ ఈ కథ విని చాలా బాగుంది ఈ కథతోనే సినిమా చేద్దామని అన్నారు. ఆయన అనుకున్న కథ పక్కన పెట్టి నేను రాసిన కథతోనే ఈ సినిమా చేస్తున్నారు. ఇది కుటుంబ సమేతంగా చూడదగ్గ చక్కని ఎంటర్‌టైనర్. హీరో క్యారెక్టర్ చాలా ఎనర్జిటిక్‌గా వుంటుంది. ఏ ప్రాబ్లమ్ వచ్చినా చాలా తెలివిగా డీల్ చేస్తాడు. తండ్రీ కొడుకుల మధ్య వచ్చే ఎమోషనల్ సీన్స్ అందరికీ కంటతడి పెట్టిస్తాయి. అన్నపూర్ణ స్టూడియోస్, శ్రీనాగ్ కార్పొరేషన్, శ్రీ జి ఫిలింస్ బేనర్స్‌లో ఈ సినిమా చేయడం నా అదృష్టంగా భావిస్తున్నాను'' అన్నారు.
దర్శకుడు జి.నాగేశ్వరరెడ్డి మాట్లాడుతూ - ''ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ చిత్రంలో తండ్రీ కొడుకుల మధ్య ఎమోషన్ అందరికీ కనెక్ట్ అవుతుంది. సుశాంత్‌కి హండ్రెడ్ పర్సెంట్ యాప్ట్ అయ్యే కథ ఇది. శ్రీధర్ సీపాన అద్భుతమైన కథ ఇచ్చాడు. ఈ కథ విన్నప్పుడే మేం చాలా ఎంజాయ్ చేశాం. సెట్‌లో సీన్స్ చిత్రీకరిస్తున్నప్పుడు కూడా అంతే ఎంజాయ్ చేస్తున్నాం. బ్రహ్మానందంగారు ఈ సినిమా కోసం 15 రోజులు వర్క్ చేశారు. జనరల్‌గా హీరో కోసం లేదా, విలన్ డెన్ కోసం,
పాటల కోసం భారీ సెట్స్ వేస్తారు. ఈ సినిమాలో కామెడీ సీన్ కోసం స్పెషల్‌గా 60 లక్షల ఖర్చుతో టైమ్ మెషీన్ సెట్ వేయడం నాకు తెలిసి ఇదే ఫస్ట్ టైమ్. ఈ కామెడీ సీన్స్ ప్రేక్షకుల్ని కడుపుబ్బ నవ్విస్తాయి. సుశాంత్ కాళిదాసు చిత్రంలో కామెడీని బాగా పండించాడు. ఈ సినిమాలో కూడా కామెడీ సీన్స్‌లో అద్భుతంగా నటించాడు. కెమెరామెన్ శివ చాలా ఎక్స్‌లెంట్ ఫోటోగ్రఫీ అందించారు. అనూప్ ఎక్స్‌ట్రార్డినరీ మ్యూజిక్ అందిస్తున్నారు. చిన్నసినిమా అయినా చాలా రిచ్‌గా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. చింతలపూడి శ్రీనివాసరావుగారు, నాగసుశీలగారి కోఆపరేషన్‌తో సినిమాని చాలా ఫాస్ట్‌గా ఫినిష్ చెయ్యగలిగాము. ఈ బేనర్స్‌లో సినిమా చెయ్యడం చాలా సంతోషాన్ని కలిగిస్తోంది'' అన్నారు.
నిర్మాత చింతలపూడి శ్రీనివాసరావు మాట్లాడుతూ - ''శ్రీనాగ్ కార్పొరేషన్‌లో ఇది నాలుగో సినిమా. మూడు సినిమాలు కొత్త దర్శకులతో చేశాం. ఆ డైరెక్టర్స్ అందరూ మంచి ఎఫర్ట్స్ పెట్టి బాగా తీశారు. నాగేశ్వరరెడ్డిగారితో ఈ సినిమా చెయ్యడం చాలా హ్యాపీగా వుంది. శ్రీధర్ సీపాన సూపర్‌హిట్ కథ ఇచ్చాడు. వాళ్ళిద్దరూ ఈ సినిమాకి పెద్ద ఎస్సెట్. ఈ చిత్రాన్ని పెద్ద హిట్ చేసే రేంజ్‌లో వాళ్లిద్దరూ కృషి చేస్తున్నారు. ఈ సినిమా అక్కినేని అభిమానులకు పెద్ద పండగలాంటిది. సినిమాలోని ముఖ్యమైన కామెడీ సీన్స్ కోసం భారీ సెట్ వేసి చిత్రీకరిస్తున్నాం. దీంతో టాకీ, యాక్షన్ పార్ట్స్ పూర్తయ్యాయి. పాటల్ని జనవరిలో చిత్రీకరించి ఆ తర్వాత సినిమాని రిలీజ్ చెయ్యడానికి ప్లాన్ చేస్తున్నాం'' అన్నారు.
నిర్మాత ఎ.నాగసుశీల మాట్లాడుతూ - ''ఈ కథ చాలా ప్రామిసింగ్ వుంటుంది. ఇలాంటి మంచి సినిమా చేయడం నిర్మాతగా నాకు చాలా హ్యాపీగా వుంది. షూటింగ్ అంతా చాలా మంచి అట్మాస్ఫియర్‌లో జరిగింది. ఔట్‌పుట్ చాలా ఎక్స్‌లెంట్‌గా వచ్చింది. ఎడిటర్ గౌతంరాజుగారు సినిమా చాలా బాగా వచ్చిందని ఫోన్ చేసి చెప్పారు. డెఫినెట్‌గా ఈ సినిమా అందరికీ నచ్చుతుంది'' అన్నారు.
సుశాంత్, సోనమ్ ప్రీత్ బజ్వా, బ్రహ్మానందం, మురళీశర్మ, పోసాని కృష్ణమురళి, వెన్నెల కిషోర్, రఘుబాబు, పృథ్వీ, ఫిరోజ్ అబ్బాసి, సుధ, ఆనంద్, రమాప్రభ, రజిత, హరీష్ తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: అనూప్ రూబెన్స్, సినిమాటోగ్రఫీ: దాశరథి శివేంద్ర, ఎడిటింగ్: గౌతంరాజు, ఆర్ట్: నారాయణరెడ్డి, ఫైట్స్: వెంకట్, రామ్ సుంకర, ఛీఫ్ కో-డైరెక్టర్. డి.సాయికృష్ణ, కో-డైరెక్టర్: కొండా ఉప్పల, ప్రొడక్షన్ కంట్రోలర్: రవికుమార్ యండమూరి, కథ-మాటలు: శ్రీధర్ సీపాన, నిర్మాతలు: చింతలపూడి శ్రీనివాసరావు, ఎ.నాగసుశీల, స్క్రీన్‌ప్లే-దర్శకత్వం: జి.నాగేశ్వరరెడ్డి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout