సుశాంత్ ఆటాడుకుందాం..రా విడుదల తేదీ ఖరారు..
Monday, August 8, 2016 తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com
Send us your feedback to audioarticles@vaarta.com
అక్కినేని ఫ్యామిలీ హీరో సుశాంత్ నటించిన తాజా చిత్రం ఆటాడుకుందాం..రా. ఈ చిత్రాన్ని జి.నాగేశ్వరరెడ్డి తెరకెక్కించారు. శ్రీనాగ్ కార్పోరేషన్ బ్యానర్ పై చింతలపూడి శ్రీనివాసరావు, ఎ.నాగసుశీల సంయుక్తంగా ఈ చిత్రాన్నినిర్మించారు. ఇటీవల రిలీజైన ఆటాడుకుందా..రా ఆడియోకు మంచి స్పందన లభిస్తుంది.
ఈ చిత్రంలో అక్కినేని హీరోలు నాగ చైతన్య, అఖిల్ ఇద్దరూ గెస్ట్ రోల్ చేస్తుండడంతో ఈ మూవీ పై మరింత క్రేజ్ పెరిగింది. దీంతో ఖచ్చితంగా ఆటాడుకుందా..రా ఘన విజయం సాధిస్తుంది అని టీమ్ నమ్మకంతో ఉన్నారు. ఇక ఈ చిత్రాన్ని ఈ నెల 19న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. మరి...ఆటాడుకుందా రా చిత్రయూనిట్ నమ్మకానికి తగ్గట్టు ఘన విజయం సాధించి సుశాంత్ కెరీర్ లో మరచిపోలేని చిత్రంగా నిలుస్తుందని ఆశిద్దాం.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments