‘స్ప్రైట్’ బ్రాండ్ అంబాసిడర్‌గా సుశాంత్
Send us your feedback to audioarticles@vaarta.com
టాలీవుడ్ హీరోలు ఓ వైపు సినిమాలు గ్యాప్ వచ్చినప్పుడు.. లేదా అటు సినిమాలు ఇటు బిజినెస్.. లేదా కమర్షియల్ వైపు ఎక్కువగా అడుగులేస్తుంటారన్న విషయం తెలిసిందే. ఇప్పటికే సూపర్ స్టార్ మహేశ్ బాబు మల్టీఫ్లెక్స్, బట్టల బిజినెస్‌లోకి దిగాడు. అంతేకాదు పలు కమర్షియల్ యాడ్స్ కూడా చేశాడు. మరోవైపు.. జూనియర్ ఎన్టీఆర్ కూడా శీతలపానీయంకు సంబంధించిన యాడ్స్ చేశాడు. అయితే తాజాగా టాలీవుడ్ యంగ్ హీరో సుశాంత్ కూడా మహేశ్, ఎన్టీఆర్‌ను ఫాలో అయ్యాడు. ఇటీవలే ‘అల వైకుంఠపురములో..’ సినిమా సూపర్ డూపర్ హిట్టవ్వడంతో మంచి ఊపు మీదున్న సుశాంత్‌ను ఓ ప్రముఖ కంపెనీ బంపరాఫర్ ఇచ్చింది.
‘స్ప్రైట్’ బ్రాండ్ అంబాసిడర్‌గా సుశాంత్ ఉండాలని కోరగా.. అందుకే సుశాంత్ ఏ మాత్రం ఆలోచించకుండా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడట. ‘స్ప్రైట్’కు సుశాంత్‌ను బ్రాండ్ అంబాసిడర్‌గా ఎంచుకున్నట్లు సదరు సంస్థ అధికారికంగా ఓప్రకటన విడుదల చేసింది. అంటే.. సుశాంత్ కూడా వాణిజ్య ప్రకటనల ప్రపంచంలోకి అడుగుపెట్టేశాడన్న మాట. ఈ బ్రాండ్‌కు సుశాంత్ చేసిన మొదటి కమర్షియల్ ప్రకటన అన్న మాట. కాగా.. ‘స్ప్రైట్’కు తమిళంలో అనిరుధ్ రవిచందర్, హిందీలో ఆయుష్మాన్ ఖురానా బ్రాండ్ అంబాసిడర్లుగా వ్యవహరిస్తుండగా.. తెలుగులో సుశాంత్ అన్న మాట. సుశాంత్ యాక్ట్ చేసిన ఈ యాడ్‌కు సంబంధించిన వీడియోను నెట్టింట్లో వదిలారు. అయితే యాడ్‌ను పెద్దగా ప్రమోట్ చేయలేదేమో కానీ.. జనాలు మాత్రం అస్సలు పట్టించుకోవట్లేదు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com