‘స్ప్రైట్’ బ్రాండ్ అంబాసిడర్‌గా సుశాంత్

  • IndiaGlitz, [Thursday,February 27 2020]

టాలీవుడ్‌ హీరోలు ఓ వైపు సినిమాలు గ్యాప్ వచ్చినప్పుడు.. లేదా అటు సినిమాలు ఇటు బిజినెస్.. లేదా కమర్షియల్‌ వైపు ఎక్కువగా అడుగులేస్తుంటారన్న విషయం తెలిసిందే. ఇప్పటికే సూపర్ స్టార్ మహేశ్ బాబు మల్టీఫ్లెక్స్, బట్టల బిజినెస్‌లోకి దిగాడు. అంతేకాదు పలు కమర్షియల్ యాడ్స్ కూడా చేశాడు. మరోవైపు.. జూనియర్ ఎన్టీఆర్ కూడా శీతలపానీయంకు సంబంధించిన యాడ్స్ చేశాడు. అయితే తాజాగా టాలీవుడ్ యంగ్ హీరో సుశాంత్ కూడా మహేశ్, ఎన్టీఆర్‌ను ఫాలో అయ్యాడు. ఇటీవలే ‘అల వైకుంఠపురములో..’ సినిమా సూపర్ డూపర్ హిట్టవ్వడంతో మంచి ఊపు మీదున్న సుశాంత్‌ను ఓ ప్రముఖ కంపెనీ బంపరాఫర్ ఇచ్చింది.

‘స్ప్రైట్’ బ్రాండ్ అంబాసిడర్‌గా సుశాంత్ ఉండాలని కోరగా.. అందుకే సుశాంత్ ఏ మాత్రం ఆలోచించకుండా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడట. ‘స్ప్రైట్’‌కు సుశాంత్‌ను బ్రాండ్ అంబాసిడర్‌గా ఎంచుకున్నట్లు సదరు సంస్థ అధికారికంగా ఓప్రకటన విడుదల చేసింది. అంటే.. సుశాంత్ కూడా వాణిజ్య ప్రకటనల ప్రపంచంలోకి అడుగుపెట్టేశాడన్న మాట. ఈ బ్రాండ్‌కు సుశాంత్ చేసిన మొదటి కమర్షియల్ ప్రకటన అన్న మాట. కాగా.. ‘స్ప్రైట్’కు తమిళంలో అనిరుధ్ రవిచందర్, హిందీలో ఆయుష్మాన్ ఖురానా బ్రాండ్ అంబాసిడర్లుగా వ్యవహరిస్తుండగా.. తెలుగులో సుశాంత్ అన్న మాట. సుశాంత్ యాక్ట్ చేసిన ఈ యాడ్‌కు సంబంధించిన వీడియోను నెట్టింట్లో వదిలారు. అయితే యాడ్‌ను పెద్దగా ప్రమోట్ చేయలేదేమో కానీ.. జనాలు మాత్రం అస్సలు పట్టించుకోవట్లేదు.

More News

Tovino Thomas' new movie gets a release date!

On Thursday, Tovino Thomas surprised his fans by announcing the release date of his new movie 'Kilometers and Kilometers'. 

Omar Lulu teams up with veteran writer

Veteran writer Dennis Joseph, one of the most celebrate scriptwriters in the 80s and 90s is making a comeback in Malayalam Cinema.

It's Mega hero for 'Bheeshma' event

With 'Bheeshma' becoming a big hit, the makers of the Nithiin movie are planning to host a grand success event on February 29, at Vizag's Gurajada Kalakshetram.

Koodathayi Serial Killer Jolly Joseph attempts suicide in jail!

Jolly Joseph, the accused of the controversial Koodathayi serial murders case killing six members of her own family, attempted suicide inside the jail.

Bernie Sanders slams Trump over Delhi riots

Bernie Sanders, the US Senator and Democratic candidate for President of the US, has waded into the polarized debate over the Delhi violence that has left over 27 dead.