రియా చాలా రోజుల పాటు నా కుమారుడికి విషమిచ్చింది: సుశాంత్ తండ్రి

  • IndiaGlitz, [Thursday,August 27 2020]

బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణానికి సంబంధించిన కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. తాజాగా సుశాంత్ ప్రియురాలు రియా చక్రవర్తి.. మాదక ద్రవ్యాల వ్యాపారి గౌరవ్ ఆర్యతో వాట్సాప్ చాటింగ్ చేసినట్టు తాజాగా బయటపడింది. సుశాంత్ కేసులో మాదకద్రవ్యాల మాఫియా ప్రమేయాన్ని ఈ వాట్సాప్ చాట్ బహిర్గతం చేసింది. గౌరవ్ ఆర్యతో చేసిన చాటింగ్‌ను రియా డిలీట్ చేసినప్పటికీ సీబీఐ అధికారులు తిరిగి సంపాదించారు.

అయితే సుశాంత్ కేసులో మాదక ద్రవ్యాల కోణం బయటపడటంతో దీనిపై ఆయన తండ్రి కేకే సింగ్ స్పందించారు. ఓ వీడియోలో సుశాంత్ తండ్రి మాట్లాడుతూ.. రియా చక్రవర్తి తన కుమారుడిని చంపిన హంతకురాలంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. చాలా రోజుల పాటు రియా తన కుమారుడికి విషమిచ్చిందని.. ఆమె ఒక హంతకురాలని ఆరోపించారు. రియాను.. ఆమె అనుచరులను దర్యాప్తు సంస్థలు వెంటనే అరెస్ట్ చేయాలని కేకే సింగ్ డిమాండ్ చేశారు.

సుశాంత్ మృతి కేసులో రియా ప్రమేయం ఉందంటూ పలువురు బహిరంగంగానే ఆరోపిస్తున్నారు. సీబీఐ కేసు దర్యాప్తు కూడా దాదాపు ఆమె చుట్టే తిరుగుతోంది. ఇటీవల సుశాంత్ సోదరి శ్వేతా సింగ్ సైతం ట్విట్టర్ వేదికగా రియాను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. సుశాంత్ కేసులో ప్రధాన నిందితురాలు బహిరంగంగా తిరుగుతూ, ఇంటర్వ్యూలు ఇస్తూ పబ్లిసిటీ స్టంట్లు చేస్తోందని ఆరోపించారు. భారత ప్రభుత్వం ఈ విషయాన్ని పరిశీలించి.. రియాను అరెస్ట్ చేయాలని ఆమె ట్వీట్ చేశారు.

More News

గుడ్ న్యూస్ చెప్పిన విరుష్క..

టీమ్ ఇండియా, రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు కెప్టెన్ విరాట్ కోహ్లీ గురువారం గుడ్ న్యూస్ చెప్పాడు.

పవన్‌కి కేంద్ర మంత్రి పదవి.. పార్టీ పరిస్థితేంటో..!?

జనసేన అధినేత పవన్ కల్యాణ్ రాజకీయ భవిష్యత్‌పై రకరకాల కథనాలు వినిపిస్తున్నాయి. జనసేన పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో ఏమాత్రం ప్రభావం చూపించలేకపోయింది.

తెలంగాణలో కొత్తగా 2795 కేసులు..

తెలంగాణలో కరోనా విజృంభిస్తోంది. మరోవైపు తెలంగాణలో పరీక్షల సంఖ్యను సైతం పెంచారు.

ఎస్పీ బాలు హెల్త్‌పై తాజా అప్‌డేట్..

గాన గంధర్వుడు ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం పరిస్థితి క్రమ క్రమంగా మెరుగవుతోందని ఆయన కుమారుడు ఎస్పీ చరణ్‌తో పాటు ఎంజీఎం వైద్య నిపుణులు వెల్లడించారు.

క‌రోనాను జయించ‌డ‌మే మనంద‌రి ధ్యేయం - నంద‌మూరి బాల‌కృష్ణ‌

కోవిడ్ మహమ్మారిపై పోరాటంలో ప్రజలు జాగ్రత్తగా మెసులుకొని ఈ క‌రోనాను జ‌యించాల‌ని అగ్ర క‌థానాయ‌కుడు, బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్