రియా చాలా రోజుల పాటు నా కుమారుడికి విషమిచ్చింది: సుశాంత్ తండ్రి
Send us your feedback to audioarticles@vaarta.com
బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణానికి సంబంధించిన కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. తాజాగా సుశాంత్ ప్రియురాలు రియా చక్రవర్తి.. మాదక ద్రవ్యాల వ్యాపారి గౌరవ్ ఆర్యతో వాట్సాప్ చాటింగ్ చేసినట్టు తాజాగా బయటపడింది. సుశాంత్ కేసులో మాదకద్రవ్యాల మాఫియా ప్రమేయాన్ని ఈ వాట్సాప్ చాట్ బహిర్గతం చేసింది. గౌరవ్ ఆర్యతో చేసిన చాటింగ్‌ను రియా డిలీట్ చేసినప్పటికీ సీబీఐ అధికారులు తిరిగి సంపాదించారు.
అయితే సుశాంత్ కేసులో మాదక ద్రవ్యాల కోణం బయటపడటంతో దీనిపై ఆయన తండ్రి కేకే సింగ్ స్పందించారు. ఓ వీడియోలో సుశాంత్ తండ్రి మాట్లాడుతూ.. రియా చక్రవర్తి తన కుమారుడిని చంపిన హంతకురాలంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. చాలా రోజుల పాటు రియా తన కుమారుడికి విషమిచ్చిందని.. ఆమె ఒక హంతకురాలని ఆరోపించారు. రియాను.. ఆమె అనుచరులను దర్యాప్తు సంస్థలు వెంటనే అరెస్ట్ చేయాలని కేకే సింగ్ డిమాండ్ చేశారు.
సుశాంత్ మృతి కేసులో రియా ప్రమేయం ఉందంటూ పలువురు బహిరంగంగానే ఆరోపిస్తున్నారు. సీబీఐ కేసు దర్యాప్తు కూడా దాదాపు ఆమె చుట్టే తిరుగుతోంది. ఇటీవల సుశాంత్ సోదరి శ్వేతా సింగ్ సైతం ట్విట్టర్ వేదికగా రియాను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. సుశాంత్ కేసులో ప్రధాన నిందితురాలు బహిరంగంగా తిరుగుతూ, ఇంటర్వ్యూలు ఇస్తూ పబ్లిసిటీ స్టంట్లు చేస్తోందని ఆరోపించారు. భారత ప్రభుత్వం ఈ విషయాన్ని పరిశీలించి.. రియాను అరెస్ట్ చేయాలని ఆమె ట్వీట్ చేశారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com