సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మ‌హ‌త్య‌

  • IndiaGlitz, [Sunday,June 14 2020]

బాలీవుడ్ న‌టుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మ‌హ‌త్య చేసుకున్నారు. ఈయ‌న వ‌య‌సు 34 ఏళ్లు. టెలివిజ‌న్ యాక్ట‌ర్‌గా కెరీర్‌ను స్టార్ట్ చేసిన సుశాంత్ సింగ్ 2013లో కై పో చే సినిమాతో హీరోగా కెరీర్‌ను స్టార్ట్ చేశాడు. త‌ర్వాత శుద్ దేశీ రొమాన్స్ చిత్రంలోనూ నటించాడు. అలాగే ఆమిర్ ఖాన్ పీకే సినిమాలో న‌టించాడు. అయితే న‌టుడిగా సుశాంత్‌కు మంచి గుర్తింపు తెచ్చిన చిత్రం మాత్రం ధోని బ‌యోపిక్‌. ఇండియ‌న్ కెప్టెన్ ‘ధోని అన్ టోల్డ్ స్టోరి’ చిత్రంలో ధోని క‌న‌ప‌రిచిన న‌ట‌న సుశాంత్‌కు చాలా మంచి పేరుని తెచ్చి పెట్టింది. చిచోరే సినిమాకు కూడా మంచి పేరు తెచ్చింది. న‌టుడిగా స‌క్సెస్‌పుల్‌గా రాణిస్తోన్న త‌రుణంలో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ముంబైలో బాంద్రా ఇంట్లో ఆత్మ‌హ‌త్య చేసుకోవ‌డం బాలీవుడ్ వ‌ర్గాల‌కు షాకింగ్‌గా అనిపిస్తుంది.

మేనేజ‌ర్ ఆత్మ‌హ‌త్య చేసుకున్న వారంలోనే...

వారం రోజుల క్రితం సుశాంత్ వ్య‌క్తిగ‌త మేనేజ‌ర్ దిశా స‌లియాన్ ముంబైలోని 14వ అంత‌స్థు నుండి దూకి ఆత్మహ‌త్య చేసుకున్నారు. ఆమె చ‌నిపోయిన వారంలోపే సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మ‌హ‌త్య చేసుకోవ‌డం సినీ వ‌ర్గాల‌ను దిగ్భ్రాంతికి గురి చేస్తుంది. అయితే పోలీసులకు అస‌లు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఎందుకు ఆత్మ‌హ‌త్య చేసుకోవాల్సి వ‌చ్చింద‌నే దానిపై ఇంకా క్లారిటీ రాలేదు. త్వ‌ర‌లోనే దీనిపై పోలీసులు ద‌ర్యాప్తులో నిజాలు తెలిసే అవ‌కాశం ఉంది. 

More News

10మిలియ‌న్స్ వ్యూస్ క్రాస్ చేసిన BB3 First Roar

సింహా', 'లెజెండ్` వంటి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్స్ త‌ర్వాత‌ నటసింహ నందమూరి బాలకృష్ణ, మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేష‌న్‌లో

సెన్సేష‌న్ క్రియేట్ చేస్తోన్న సాయితేజ్ ‘నో పెళ్లి..’ సాంగ్

సుప్రీమ్ హీరో సాయితేజ్ హీరోగా ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ శ్రీ వెంక‌టేశ్వ‌ర సినీ చిత్ర ఎల్‌.ఎల్‌.పి బ్యాన‌ర్‌పై బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తోన్న చిత్రం `సోలో బ్ర‌తుకే సో బెట‌ర్‌`.

మాక్ షూట్‌కి జ‌క్క‌న్న అండ్ టీమ్‌

ద‌ర్శ‌క‌ధీరుడు ఎస్‌.ఎస్‌.రాజ‌మౌళిపై రెండు తెలుగు ప్ర‌భుత్వాలు పెద్ద బాధ్య‌త‌నే పెట్టాయ‌నుకోవాలి.

కాస్టింగ్ కౌచ్‌పై తేజ‌స్వి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

హీరోయిన్‌, హీరోయిన్ స్నేహితురాలిగా ప‌లు సినిమాల్లో న‌టించిన తేజ‌స్విని మ‌డివాడ రీసెంట్‌గా ఇండ‌స్ట్రీలో కాస్టింగ్ కౌచ్‌పై బాంబు పేల్చింది.

రెమ్యున‌రేష‌న్ తగ్గించుకున్న డైరెక్టర్ పరశురామ్?

ప్ర‌స్తుతం క‌రోనా ప్ర‌భావంతో సినీ ప‌రిశ్ర‌మ‌కు చాలా భారీ న‌ష్టాలే వాటిల్లింది. రెండు నెల‌లు పాటు సినిమాల రిలీజులు లేవు.