సక్సెస్ కోసం మావయ్యను ఫాలో అవుతున్న మేనల్లుడు..

  • IndiaGlitz, [Tuesday,August 02 2016]

మావ‌య్య‌ను ఫాలో అవుతున్న మేన‌ల్లుడు ఎవ‌రో కాదు అక్కినేని ఫ్యామిలీ హీరో సుశాంత్. ఇంత‌కీ విష‌యం ఏమిటంటే...ఇటీవ‌ల నాగార్జున న‌టించిన సంచ‌ల‌న చిత్రం సోగ్గాడే చిన్ని నాయ‌నా. క‌ళ్యాణ్ కృష్ణ తెర‌కెక్కించిన సోగ్గాడే చిన్ని నాయ‌నా చిత్రం సంక్రాంతి కానుక‌గా రిలీజై 53 కోట్ల‌కు పైగా షేర్ వ‌సూలు చేసి సంచ‌ల‌నం సృష్టించింది.
ఈ చిత్రంలో నాగార్జున పంచెక‌ట్టుతో బంగార్రాజు పాత్ర‌తో అంద‌ర్నీ ఆకట్టుకున్నారు. ఇప్పుడు సుశాంత్ కూడా చిన మావ‌య్య నాగార్జున‌ను ఫాలో అవుతూ పంచెక‌ట్టుతో ద‌ర్శ‌న‌మిస్తున్నాడు. జి.నాగేశ్వ‌ర‌రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో సుశాంత్ న‌టించిన చిత్రం ఆటాడుకుందాం రా. ఈ చిత్రంలో సుశాంత్ తాత అక్కినేని ప‌ల్లెకుపోదాం... అనే పాట‌ను రీమిక్స్ చేసాడు. ఇలా...తాత అక్కినేని, మావ‌య్య నాగార్జున‌ను ఫాలో అవుతూ చేస్తున్న ఆటాడుకుందాం రా సినిమాతో సుశాంత్ స‌క్సెస్ సాధిస్తాడ‌ని ఆశిద్దాం.

More News

ఇంకొక్కడు లో డిఫరెంట్ గెటప్ తో షాక్ ఇచ్చిన విక్రమ్

తమిళ హీరో విక్రమ్ నటిస్తున్న తాజా చిత్రం ఇరు ముగన్.

ప్రభాస్ నెక్ట్స్ మూవీ గురించి క్లారిటీ వచ్చేసింది..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం బాహుబలి 2చిత్రంలో నటిస్తున్నారు.

సెప్టెంబర్ లో రానున్న కాకతీయుడు

నందమూరి తారకరత్న,శిల్ప,యామిని,రేవతి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం కాకతీయుడు.ఎల్.వి.ఆర్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై లగడపాటి శ్రీనివాస్ ఈ చిత్రాన్నినిర్మిస్తున్నారు.

గౌతమీపుత్ర శాతకర్ణి లేటెస్ట్ అప్ డేట్స్..

నందమూరి నటసింహం బాలకృష్ణ నటిస్తున్న వందో చిత్రం గౌతమీపుత్ర శాతకర్ణి.

ఓన్లీ లవ్ ఈజ్ రియల్ - రాశీ ఖన్నా

ఊహలు గుసగుసలాడే..చిత్రంతో తెలుగు తెరకు పరిచయమై తొలి చిత్రంతోనే అందర్నీ ఆకట్టుకున్న ముద్దుగుమ్మ రాశీ ఖన్నా.