సుశాంత్ సీబీకి.. ధృవీకరించిన సీబీఐ అధికార ప్రతినిధి
- IndiaGlitz, [Wednesday,August 05 2020]
బాలీవుడ్ కథానాయకుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం దేశ వ్యాప్తంగా సంచలనం రేపిన విషయం తెలిసిందే. ఇది హత్యా? ఆత్మహత్యా? అన్న విషయాలపై ఇప్పటికీ వాదోపవాదాలు జరుగుతూనే ఉన్నాయి. సోషల్ మీడియాలో నెటిజన్లు మాత్రం ఎక్కువ శాతం సుశాంత్‌ది హత్యేనని చెబుతున్నారు. ఈ తరుణంలో సుశాంత్ కేసు సీబీఐకి అప్పగించాలని బీహార్ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి సిఫారసు చేసింది.
అయితే దీనికి కేంద్ర ప్రభుత్వం కూడా అంగీకరించింది. సీబీఐ విచారణకు కేంద్రం ఆదేశించింది. ఈ మేరకు తాజాగా డీఓపీటీ నోటిఫికేషన్ విడుదల చేసినట్టు సీబీఐ అధికార ప్రతినిధి ఒకరు ధృవీకరించారు. కాగా సుశాంత్ కేసును సీబీఐకి అప్పగించేందుకు కేంద్ర ప్రభుత్వం అంగీకరించిందని బుధవారం సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా సుప్రీంకోర్టుకు వెల్లడించారు.