బాలకృష్ణ డేట్కే వస్తున్న సూర్య?
Send us your feedback to audioarticles@vaarta.com
2018 సంక్రాంతి తెలుగు ప్రేక్షకులకు వినోదానికి చిరునామాలా మారనుంది. ఎందుకంటే.. అటుఇటుగా ఏడు సినిమాలు సందడి చేసేందుకు సిద్ధమవుతున్నాయి మరి. వాటిలో మూడు లేదా నాలుగు తెలుగు చిత్రాలుంటే.. మరో మూడు తమిళ అనువాద చిత్రాలు ఉన్నాయి. ఆ అనువాద చిత్రాలలో సూర్య నటిస్తున్న సినిమా కూడా ఉంది. తానే సేరంద కూటమ్ పేరుతో తమిళంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్గా నటిస్తోంది.
కాగా, తెలుగులో ఈ సినిమాకి గ్యాంగ్ అనే పేరు ఖరారయ్యింది. జనవరి 12న ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. విశేషమేమిటంటే.. అదే రోజున నటసింహ బాలకృష్ణ నటిస్తున్న జై సింహా కూడా విడుదల కాబోతోంది. నయనతార హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రానికి కె.ఎస్.రవికుమార్ దర్శకత్వం వహిస్తున్నారు.
అంటే.. బాలకృష్ణ విడుదల తేదికే సూర్య సినిమా కూడా రానుందన్నమాట. ఈ రెండు చిత్రాలతో పాటు పవన్ 25వ చిత్రం, రవితేజ టచ్ చేసి చూడు, విశాల్ అభిమన్యుడు, విక్రమ్ స్కెచ్, రాజ్ తరుణ్ రంగులరాట్నం కూడా సంక్రాంతికి సందడి చేసేందుకు సిద్ధమవుతున్నాయి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments