బాల‌కృష్ణ డేట్‌కే వ‌స్తున్న‌ సూర్య‌?

  • IndiaGlitz, [Friday,November 24 2017]

2018 సంక్రాంతి తెలుగు ప్రేక్ష‌కుల‌కు వినోదానికి చిరునామాలా మార‌నుంది. ఎందుకంటే.. అటుఇటుగా ఏడు సినిమాలు సంద‌డి చేసేందుకు సిద్ధ‌మ‌వుతున్నాయి మ‌రి. వాటిలో మూడు లేదా నాలుగు తెలుగు చిత్రాలుంటే.. మ‌రో మూడు త‌మిళ అనువాద చిత్రాలు ఉన్నాయి. ఆ అనువాద చిత్రాల‌లో సూర్య న‌టిస్తున్న సినిమా కూడా ఉంది. తానే సేరంద కూట‌మ్ పేరుతో త‌మిళంలో తెర‌కెక్కుతున్న ఈ సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్‌గా న‌టిస్తోంది.

కాగా, తెలుగులో ఈ సినిమాకి గ్యాంగ్ అనే పేరు ఖరార‌య్యింది. జ‌న‌వ‌రి 12న ఈ సినిమాని ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురానున్నారు. విశేష‌మేమిటంటే.. అదే రోజున న‌ట‌సింహ బాల‌కృష్ణ న‌టిస్తున్న జై సింహా కూడా విడుద‌ల కాబోతోంది. న‌య‌న‌తార హీరోయిన్‌గా న‌టిస్తున్న ఈ చిత్రానికి కె.ఎస్‌.ర‌వికుమార్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు.

అంటే.. బాల‌కృష్ణ విడుద‌ల తేదికే సూర్య సినిమా కూడా రానుంద‌న్న‌మాట‌. ఈ రెండు చిత్రాల‌తో పాటు ప‌వ‌న్ 25వ చిత్రం, ర‌వితేజ ట‌చ్ చేసి చూడు, విశాల్ అభిమ‌న్యుడు, విక్ర‌మ్ స్కెచ్‌, రాజ్ త‌రుణ్ రంగులరాట్నం కూడా సంక్రాంతికి సంద‌డి చేసేందుకు సిద్ధ‌మ‌వుతున్నాయి.

More News

'హ‌లో'.. అజ‌య్ ఫ‌స్ట్‌లుక్‌

క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్‌గా, విల‌న్‌గా, స‌పోర్టింగ్ యాక్ట‌ర్‌గా, హీరోగా.. ఇలా అన్ని కోణాల్లోనూ త‌న న‌ట‌న‌తో మెప్పించే ప్ర‌య‌త్నం చేస్తుంటాడు న‌టుడు అజ‌య్‌.

న‌య‌న్ స్పెష‌ల్‌

ద‌క్షిణాదిలోని అన్ని భాష‌ల్లోనూ స‌క్సెస్‌ఫుల్ హీరోయిన్‌గా పేరు తెచ్చుకుంది కేర‌ళ‌కుట్టి న‌య‌న‌తార‌. ప్ర‌స్తుతం ఈ ముద్దుగుమ్మ త‌మిళంలో నెంబ‌ర్ వ‌న్ హీరోయిన్‌గా రాణించ‌డ‌మే కాకుండా.. కోలీవుడ్ లేడీ సూప‌ర్‌స్టార్‌గా పేరు తెచ్చుకుంది.

'వైశాఖం' మంచి సినిమాగా గుర్తింపు పొందడం ఎంతో సంతృప్తిగా వుంది - జయ బి

ఫిలిం ఎనలిటికల్‌ అండ్‌ అప్రిషియేషన్‌ సొసైటీ (ఫాస్‌) - అక్కినేని 2017 సినీ, టీవి అవార్డుల ప్రదానోత్సవం మరియు ఫాస్‌ సిల్వర్‌ క్రౌన్‌ ఫిలిం అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమం నవంబర్‌ 23న హైదరాబాద్‌ త్యాగరాయగాన సభలో చిత్ర ప్రముఖులు, ఆహుతుల మధ్య ఘనంగా జరిగింది.

2 కంట్రీస్ టీజ‌ర్ ఇంట్రెస్టింగ్‌గా ఉంది.. ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ళ్యాణ్‌

సునీల్ క‌థానాయ‌కుడిగా శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన 2 కంట్రీస్ టీజ‌ర్‌ను నా చేతుల మీదుగా లాంచ్ చేయ‌టం ఆనందంగా ఉంది.  మ‌ళ్లీ మ‌ళ్లీ చూడాలనిపించేలా టీజ‌ర్ చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంది. టీజ‌ర్‌లాగానే సినిమా ఉంటుంద‌ని ఆశిస్తూ చిత్ర‌యూనిట్‌కు అభినంద‌న‌లు తెలియ‌జేస్తున్నాను.

సప్తగిరి ఇంత బాగా డ్యాన్స్‌లు చేస్తాడని అస్సలు ఎక్స్‌పెక్ట్‌ చెయ్యలేదు - సాయిధరమ్‌ తేజ్‌

కామెడీ కింగ్‌ సప్తగిరి కథానాయకుడిగా 'సప్తగిరి ఎక్స్‌ప్రెస్‌' వంటి సూపర్‌హిట్‌ చిత్రాన్ని నిర్మించిన సాయి సెల్యులాయిడ్‌ సినిమాటిక్‌ క్రియేషన్స్‌ ప్రై లిమిటెడ్‌ అధినేత డా.రవికిరణ్‌ మళ్లీ సప్తగిరి హీరోగా 'సప్తగిరి ఎల్‌ఎల్‌బి' చిత్రాన్ని నిర్మిస్తున్న విషయం తెలిసిందే.