జయరామ్ హత్యకేసు: మోసపోయానంటున్న నటుడు సూర్య
Send us your feedback to audioarticles@vaarta.com
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన ప్రముఖ ఎన్నారై, ఎక్స్‌ప్రెస్ టీవీ చైర్మన్ చిగురుపాటి జయరామ్ హత్యకేసులో గంట గంటకో ట్విస్ట్.. రోజుకో సంచలన విషయం వెలుగు చూస్తోంది. ఇప్పటికి పలు మలుపులు తిరిగిన ఈ కేసులో ఆర్టిస్ట్ సూర్య ప్రసాద్ పాత్ర ఉందని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ఆయన్ను విచారిస్తామని పోలీసులు కూడా స్పష్టం చేశారు. అయితే తాజాగా ఈ వ్యవహారంపై సూర్య స్పందించి క్లారిటీ ఇచ్చాడు.
సూర్య మాటల్లోనే..
"జయరాం హత్యకేసుతో నాకు సంబంధం లేదు. జయరాంను ఎప్పుడూ చూడలేదు.. ఆయనెవరో కూడా నాకు తెలియదు. నాపై ఆరోపణలు రావడం దురదుష్టకరం. శిఖా చౌదరి ఎవరో తెలియదు. నా సినిమా ప్రమోషన్లో భాగంగా డబ్బులు అవసరమైతే ఓ వ్యక్తి నన్ను రాకేష్‌రెడ్డికి పరిచయం చేశారు.
రూ. 25లక్షలు ఇస్తే ప్రామిసరీ నోట్లు, చెక్కులు ఇస్తానని చెప్పాను. హనీట్రాప్ గురించి నాకు అస్సలు తెలియదు. రాకేష్‌తో పరిచయం నా ఇమేజ్ను పాడు చేసింది. రాకేష్ బిల్డప్ చూసి మోసపోయాను.
జయరాం హత్యకు రెండ్రోజుల ముందు రాయదుర్గం పోలీస్‌స్టేషన్ దగ్గర రాకేష్‌రెడ్డిని కలుసుకున్నాను" అంతేనని అంతకుమించి తనకేం తెలియదని సూర్య స్పష్టం చేశాడు. అయితే ఈ ఇంతటితో ఈ వ్యవహారానికి పుల్‌స్టాప్ పడుతుందా లేదా అనేది తెలియాలంటే మరికొన్నిరోజులు వేచి చూడాల్సిందే.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments