సూర్య ఔట్.. వెక్కి వెక్కి ఏడ్చిన ఇనయా, ‘"ఉన్మాది" వంటూ రేవంత్‌పై నాగ్ ఫైర్

ఈ వారం బిగ్‌బాస్ ఊహించని ట్విస్టులతో సాగుతోన్న సంగతి తెలిసిందే. సహజంగా బిగ్‌బాస్‌లో శనివారం రాగానే కింగ్ నాగార్జున స్టేజ్‌ పైకి వచ్చి కంటెస్టెంట్స్‌ని సేవ్ చేసుకుంటూ వచ్చి ఆదివారం ఎవరో ఒకరిని ఎలిమినేట్ అయినట్లుగా ప్రకటించేవారు. కానీ ఈసారి ఆయన షాకిచ్చారు. సేవ్ చేయడం లాంటివి ఏమీ లేవని.. డైరెక్ట్ ఎలిమినేషనే అని తేల్చేశారు. ఆ ట్విస్ట్ కూడా అలాంటి ఇలాంటిది కాదు. ఏకంగా ఆర్జే సూర్యనే ఎలిమినేట్ చేశారు. తన చేతిలో వున్న స్క్రోల్‌లో ఎవరి పేరైతే ఉంటుందో వారు ఎలిమినేట్ అవుతారని చెప్పారు. అందులో ఎవ్వరూ ఊహించని విధంగా సూర్య పేరొచ్చింది. అంతే ఇనయా షాక్‌కు గురైంది. సూర్యను పట్టుకుని వెక్కి వెక్కి ఏడ్చింది. అతడిపై ముద్దుల వర్షం కురిపించింది. ఫైమా, కీర్తి సూతం సూర్య వెళ్లిపోతుంటే ఒకింత ఎమోషనల్ అయ్యారు. కానీ మిగిలిన కంటెస్టెంట్స్ మాత్రం ఇందులో ఏదో స్ట్రాటజీ వుందని, అతన్ని సీక్రెట్ రూమ్‌లో పెడతారని భావిస్తున్నారు. మరి సూర్య నిజంగానే ఎలిమినేట్ అయ్యాడో లేక స్రీకెట్ రూమ్‌లోకి వెళ్లాడో తెలియాలంటే రేపటి వరకు ఆగాల్సిందే.

అంతకుముందు ‘‘చేపల చెరువు’’ టాస్క్ రచ్చపై క్లాస్ తీసుకున్నారు నాగార్జున. ముఖ్యంగా రేవంత్‌కి గట్టిగా ఇచ్చారు. ఒక వీడియో చూపిస్తూ.. గీతూ, కీర్తిలను గేమ్‌లో ఎందుకు తోసేశావని ప్రశ్నించారు నాగ్. నువ్వొక ఉన్మాదిలా బీహేవ్ చేశావ్... నీ అగ్రెషన్ అలాగే వుందంటూ మండిపడ్డారు. కానీ రేవంత్ ఆటకి తొమ్మిది మార్కులు ఇచ్చారు. తర్వాత శ్రీహాన్- శ్రీసత్యలతో మాట్లాడుతూ... మీరిద్దరూ కలిసి ఆడారా లేక మిగిలిన వారి హెల్ప్ తీసుకున్నారా అని ప్రశ్నించారు. కలిసే ఆడాం సార్ అని వారిద్దరూ ఆన్సర్ ఇచ్చారు. కాదు.. మీరు గీతూ దయా దాక్షిణ్యాల మీద ఆధారపడ్డారంటూ మండిపడ్డారు నాగ్.

రోహిత్, కీర్తిలు బాగా ఆడారని కాంప్లిమెంట్ ఇచ్చారు నాగార్జున. రాజ్, ఫైమాలు బాగా ఆడారని... కొందరి విషయంలో నువ్వు జారుతున్నావ్... జాగ్రత్తగా వుండాలని ఫైమాను హెచ్చరించాడు. తర్వాత బాలాదిత్య- మెరీనాలతో మాట్లాడిన నాగ్... బాలాదిత్యకు కోప్పడిన సందర్భాన్ని ప్రస్తావించాడు. సత్యతో గొడవ సందర్భంగా అతనికి సారీ చెప్పానని శ్రీసత్య తెలిపింది.

ఇక నాట్ బట్ నాట్ ది లీస్ట్.. గీతక్క. ఈవారం ఆటను మలుపు తిప్పి వన్ మాన్ షోలా వ్యవహరించింది గీతూ. తనకు చేపలు దొరక్కుండా చేశారనే అక్కసుతో రేవంత్‌పై పగబట్టింది. అంతేనా సంచాలక్‌గా వుంటూ ఆటను పర్యవేక్షించాల్సిందిపోయి ... కంటెస్టంట్‌లా చేపలు ఏరుకుంది. చివరికి రేవంత్ - ఇనయాల దగ్గర ఎక్కువ చేపలు వున్నప్పటికీ తన స్ట్రాటజీ వాడింది. నల్ల చేపను తెచ్చి రేవంత్‌కు చెక్ పెట్టి.. శ్రీహాన్‌ టీమ్‌ను టాప్‌లో నిలబెట్టింది. అప్పుడే ఇనయాపై నెటిజన్లు మండిపడ్డారు. మరి ఇంత చేస్తే నాగార్జున వదులుతాడా... నువ్వు గెలవాలని కాకుండా, అవతలి వారి వీక్‌నెస్ మీద దెబ్బకొట్టాలని ట్రై చేశావ్ అంటూ గీతూపై మండిపడ్డారు. గేమ్ బాగా ఆడాలని , దగ్గరుండి ఆడిపిద్దామని... కావాలనే రెచ్చగొట్టానని గీతూ బదులిచ్చింది. దీనికి నాగ్ సీరియస్ అయ్యాడు. గేమ్‌ను ఇంట్రస్ట్‌గా మార్చడం ఎలాగో బిగ్‌బాస్ చూసుకుంటాడు అని సున్నితంగా మందలించాడు. ఆటలో ఇన్వాల్వ్ అవ్వడానికి సంచాలక్‌గా అంటే ఎంపైర్...నీ ఆట బొచ్చులో ఆట అయిపోయిందంటూ నాగ్ మండిపడ్డారు.

More News

Rudhrudu: రాఘవ లారెన్స్ కధానాయకుడిగా 'రుద్రుడు' గ్లింప్స్ విడుదల

నటుడు-కొరియోగ్రాఫర్-దర్శకుడు రాఘవ లారెన్స్ కధానాయకుడిగా కతిరేసన్ దర్శకత్వంలో

'కొరమీను' మోషన్ పోస్టర్‌ను విడుదల చేసిన లావణ్య త్రిపాఠి

జాలరిపేట నేపధ్యంలో సాగే సినిమాలు వాస్తవానికి  దగ్గరగా ఉంటాయి. అలాంటి ఆసక్తికరమైన,  ఉత్కంఠభరితమైన చిత్రంగా

నాని చేతుల మీదుగా అశోక్ సెల్వన్ ‘ఆకాశం’ ట్రైలర్ రిలీజ్

వెర్సటైల్ యాక్టర్ అశోక్ సెల్వన్ ద్వి (తెలుగు, తమిళం) భాషా చిత్రం ‘ఆకాశం’.

దర్శకుడు వేణు శ్రీరామ్ చేతుల మీదుగా "భీమదేవరపల్లి బ్రాంచి" ఫస్ట్ లుక్ & మోషన్ పోస్టర్ లాంచ్

"భీమదేవరపల్లి బ్రాంచి " ఇటీవల షూటింగ్ పూర్తిచేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ చిత్రానికి సంబంధించన ఫస్ట్ లుక్,

కెప్టెన్‌గా శ్రీహాన్.. మళ్లీ బావ కౌగిట్లోకి ఇనయా, ఆదిరెడ్డికి సర్‌ప్రైజ్

బిగ్‌బాస్ 6 తెలుగు సీజన్ ఇప్పుడిప్పుడే రసవత్తరంగా సాగుతోంది. ముఖ్యంగా టాస్క్‌లు మంచి మజాను ఇస్తుండగా..