సూర్యకిరణ్ అవుట్.. ఊహించని కంటెస్టెంట్ ఇన్..

  • IndiaGlitz, [Monday,September 14 2020]

ఇవాళ బిగ్‌బాస్ చాలా ఆసక్తికరంగా సాగింది. హోస్ట్ నాగార్జున షోని అద్భుతంగా నడిపించేశారు. ఇవాళ షోలో రెండు ముఖ్యమైన ఘటనలు జరిగాయి. ఒకరు షో నుంచి ఎలిమినేట్ అయి బయటకు వెళ్లిపోగా.. ఒకరు వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా షోలోకి అడుగు పెట్టారు. నేటి షో స్టార్టింగ్ సీన్ గార్డెన్ ఏరియాకు మారిపోయింది. గర్ల్స్ అండ్ బాయ్స్ జుగల్‌బందీతో హోస్ట్ నాగార్జున కంటెస్టెంట్లలో హుషారు తెప్పించారు. జిగేలురాణి సాంగ్‌‌కు మొనాల్‌ మెప్పించగా.. మెహబూబ్ ఇన్నాళ్లూ ఈ టాలెంట్ ఎక్కడ దాచాడో ఏమోగానీ అదరగొట్టేశాడు. తర్వాత వచ్చిన కరాటే కల్యాణి, సోహైల్‌లు.. నెక్ట్స్.. హారిక, నోయెల్‌‌ల పెర్ఫార్మెన్స్ ఆకట్టుకుంది. ఏమో అనుకున్నాం కానీ దేవి కూడా అదరగొట్టేశారు. అభికి గట్టి పోటీ ఇచ్చారు. నెక్ట్స్.. అఖిల్, దివి పెర్ఫార్మెన్స్ చాలా క్యూట్‌గా అనిపించింది. ఇక సూర్యకిరణ్, లాస్య వచ్చారు. ఈ పెర్ఫార్మెన్స్ మాత్రం బాగా నవ్వు తెప్పించింది. జుగల్‌బందీలో ఫినిషింగ్ టచ్ అదిరిపోయింది.. గంగవ్వ, అమ్మ రాజశేఖర్‌‌‌ల పెర్ఫార్మెన్స్ పోటీ ఆకట్టుకుంది.

సాంగ్ ద్వారా నాగ్ ఒకరిని సేవ్ చేశారు. హీరో అఖిల్ సినిమాలో సాంగ్‌ని ప్లే చేయడం ద్వారా కంటెస్టెంట్ అఖిల్‌ని సేవ్ చేశారు. నెక్ట్స్ రైమ్స్ ఫిక్షనరీ గేమ్ ఆడించారు. ఒకరు బొమ్మ గీస్తే.. దానికి సంబంధించిన రైమ్‌ను మరో కంటెస్టెంట్ చెప్పాలి. ఈ ఆట ముగియగానే నాగ్.. మెహబూబ్‌ని సేవ్ చేశారు. అంతా భావించినట్టుగానే డ్రమిటికల్‌గా సూర్యకిరణ్ ఎలిమినేషన్‌ను నాగ్ ప్రకటించారు. తన ఎలిమినేషన్‌ను ఊహించని సూర్యకిరణ్.. చాలా ఆవేదనతో హౌస్ నుంచి బయటకు వెళ్లినట్టు అనిపించింది. సూర్యకిరణ్ బయట ఉంటేనే హ్యాపీగా ఉంటారని.. అమ్మ రాజశేఖర్ కెమెరాకు చెప్పారు. అందరికంటే తక్కువ ఓట్స్ సూర్యకిరణ్‌కు పోలయ్యాయని అందుకే ఆయన ఎలిమినేట్ అయ్యారని నాగ్ తెలిపారు.

కొన్ని జంతువులు, పక్షుల బొమ్మలను ఇచ్చి ఎవరికి ఏమిస్తావని సూర్యకిరణ్‌ను అడగ్గా.. మొనాల్‌కు నెమలిని ఇచ్చారు. గంగవ్వకు చీమను ఇచ్చి దానికి సూర్యకిరణ్ ఇచ్చిన క్లారిఫికేషన్ అదిరిపోయింది. దేవికి మొసలిని ఇచ్చారు. పవర్‌ఫుల్, పర్ఫెక్ట్ ఉమన్ అని చెప్పారు. సొహైల్‌కు ఎలుకను, అభికి పిల్లిని,దివికి తాబేలును ఇచ్చారు. కరాటే కల్యాణికి కోతిని,. మెహబూబ్‌కు గద్ద.. హారికకు పాము, సుజాతకు కుక్క, అరియానాకు గుడ్లగూబ, అఖిల్‌కు దున్నపోతు, అమ్మ రాజశేఖర్‌కు సింహాన్ని ఇచ్చారు. సూర్యకిరణ్.. బిగ్‌బాంబ్‌ని దేవికి ఇచ్చారు. ఒకరోజు పనుల నుంచి ఫ్రీగా ఉండే అవకాశం బిగ్‌బాంబ్ ద్వారా దేవికి దక్కింది. లాస్ట్‌లో నాగ్ ఓ సర్‌ప్రైజ్ ఇచ్చారు. కొత్త కంటెస్టెంట్‌ను బిగ్‌బాస్ హౌస్‌లోకి నాగ్ ప్రవేశపెట్టారు. ‘కేరింత’ కమెడియన్‌ను వైల్డ్ కార్డ్ ఎంట్రీగా కుమార్ సాయిని ప్రవేశపెట్టారు.