సూర్య 'గ్యాంగ్'?

  • IndiaGlitz, [Monday,November 27 2017]

హీరో సూర్య‌, విఘ్నేష్ శివ‌న్ కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న చిత్రం తానా సెంద కూట్ట‌మ్‌. స్టూడియో గ్రీన్ బ్యాన‌ర్‌పై జ్ఞాన‌వేల్ రాజా నిర్మించిన ఈ చిత్రాన్ని తెలుగులో గ్యాంగ్ అనే పేరుతో విడుద‌ల చేస్తున్నారు.

బాలీవుడ్ చిత్రం స్పెష‌ల్ చ‌బ్బీస్‌కు రీమేక్‌లా సినిమా ఉంటుంద‌ని వార్త‌లు విన‌ప‌డుఉత‌న్న నేప‌థ్యంలో ఈ టైటిల్‌కి ప్రాధాన్య‌త సంత‌రించుకుంది. తెలుగు, త‌మిళంలో సినిమాను సంక్రాంతికి విడుద‌ల చేయాల‌ని నిర్మాత‌లు భావిస్తున్నారు.

తెలుగులో మ‌రేవ‌రైనా నిర్మాత‌లు సినిమాను విడుద‌ల చేస్తారా? లేక జ్ఞాన‌వేల్ త‌న ప‌రిచ‌యం ద్వారా గీతాఆర్ట్స్ సంస్థ స‌హాయంతో సినిమా విడుద‌ల చేస్తుందా అని చూడాలి. ఈ సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్‌గా న‌టిస్తుంది. ర‌మ్య‌కృష్ణ కీల‌క‌పాత్ర‌లో న‌టిస్తుంది.

More News

కీర్తి తెలుగు డ‌బ్బింగ్‌?

చ‌క్క‌నమ్మా ఏం ప‌లికినా అంద‌మే..అనే రీతిలో ఏ భాష నుండి అయినా తెలుగులోకి వ‌స్తున్న హీరోయిన్స్ అంద‌రూ ఇప్పుడు తెలుగును నేర్చుకోవ‌డానికి ఆస‌క్తిని చూపుతున్నారు. రాశిఖ‌న్నా లాంటివారు తెలుగు భాష‌ను నేర్చుకోవ‌డ‌మే కాదు, ఏకంగా పాట‌లు కూడా పాడేస్తున్నారు.

జ‌న‌వరి 20 నుంచి హిట్ కాంబినేష‌న్ చిత్రం

ద‌ర్శ‌కుడు ఎ.ఆర్.మురుగదాస్, త‌మిళ క‌థానాయ‌కుడు విజయ్ లది సూపర్ హిట్ కాంబినేష‌న్‌. ఇప్ప‌టికే తుపాకి, క‌త్తి (ఖైదీ నెం.150 ఒరిజ‌న‌ల్ వెర్ష‌న్‌) చిత్రాల‌తో ఈ ఇద్ద‌రు రెండు విజ‌యాల‌ను సొంతం చేసుకున్నారు.

దుబాయ్‌లో 'జై సింహా'

నటసింహ బాలకృష్ణ నటిస్తున్న 102వ చిత్రం 'జై సింహా'. న‌య‌న‌తార‌, హ‌రిప్రియ‌, న‌టాషా దోషి క‌థానాయిక‌లు. కె.ఎస్‌.ర‌వికుమార్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు.

బ‌న్ని బాగా క‌ష్ట‌ప‌డుతున్నారు

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా తెర‌కెక్కుతున్న యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘నా పేరు సూర్య’. ర‌చ‌యిత వక్కంతం వంశీ మొదటిసారిగా ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ చిత్రంలో అను ఇమ్మాన్యుయేల్ హీరోయిన్‌గా న‌టిస్తోంది.

'ఒక్క క్ష‌ణం' వాయిదా ప‌డ‌నుందా?

సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ఇప్పటికే ఈ ఏడాదిలో ఐదు సినిమాలను విడుదల చేసారు. ఇప్పుడు డబుల్ హ్యాట్రిక్ సినిమాగా నాని నటించిన 'ఎం.సి.ఎ.' కూడా రిలీజ్ కి సిద్దంగా ఉంది. అయితే ఈ సినిమాను డిసెంబర్ 21న రిలీజ్ చేయాలని నిశ్చయించారు.