సూర్య 'గ్యాంగ్' మూవీ ఫస్ట్ లుక్

  • IndiaGlitz, [Saturday,December 02 2017]

స్టార్ హీరో సూర్యకు ఎంతటి ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకంగాచెప్పక్కర్లేదు. సూర్య నటించిన ప్రతీ సినిమా తమిళంతో పాటు తెలుగులోనూ అంతే భారీగా విడుదలౌతాయి. తాజాగా జ్ఞానవేళ్ రాజా నిర్మాతగా సూర్య కథానాయకుడిగా విగ్నేష్ శివన్ దర్శకత్వంలో రూపొందించిన "తాన సెరంధ కూటమ్" అనే తమిళ చిత్రాన్ని తెలుగులో ప్రతిష్టాత్మక యు. వి. క్రియేషన్స్ బ్యానర్లో "గ్యాంగ్" పేరుతో భారీగా రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తోంది.

ఈ చిత్ర ఫస్ట్ లుక్ పోస్టర్ ను సోషల్ మీడియా ద్వారా రిలీజ్ చేశారు. రిలీజ్ చేసిన కొద్దిగంటల్లోనే... సూపర్బ్ రెస్పాన్స్ తో దూసుకెళ్తోంది. కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించింది. రమ్యకృష్ణ, కార్తీక్ కీలక పాత్రలు పోషించారు. అనిరుథ్ సంగీతమందించారు. జనవరి 12, 2018న ఈ చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేస్తున్నట్టు యువి క్రియేషన్స్ నిర్మాతలు ప్రమోద్, వంశి ప్రకటించారు.

ఈ సందర్భంగా నిర్మాతలు ప్రమోద్, వంశి మాట్లాడుతూ.... సూర్యకున్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అందుకే ఆయన తమిళంలో విగ్నేష్ దర్శకత్వంలో నటించిన చిత్రాన్ని తెలుగులో గ్యాంగ్ పేరుతో మా యువి క్రియేషన్స్ బ్యానర్లో భారీగా రిలీజ్ చేస్తున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. ఈ చిత్ర ఫస్ట్ లుక్ పోస్టర్ కు అద్భుతమైన స్పందన లభించింది.

అనిరుధ్ సంగీతమందించిన పాటలు చాలా బాగా వచ్చాయి. కీర్తి సురేష్ నటన హైలైట్ గా నిలుస్తుంది. కార్తిక్, రమ్యకృష్ణ కీలక పాత్రల్లో కనిపిస్తారు. జనవరి 12న సంక్రాంతి కానుకగా ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు అందించేందుకు సన్నాహాలు చేస్తున్నాం. అని అన్నారు.

More News

డ‌బ్బింగ్‌లో వ‌రుణ్ తేజ్ చిత్రం

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ క‌థానాయ‌కుడుగా నటిస్తున్న తాజా చిత్రం 'తొలి ప్రేమ' (ప్ర‌చారంలో ఉన్న పేరు). డెబ్యు డైరెక్టర్ వెంకీ అట్లూరి రూపొందిస్తున్నాడు.

లేడీ డాన్స్ మాస్టర్ తో బన్నీ

తెలుగు సినిమా ఇండ‌స్ట్రీలో ఇప్ప‌టి యువ క‌థానాయ‌కుల్లో బ‌న్నికి ఓ సెప‌రేట్ గుర్తింపు ఉంది. అదే డ్యాన్స్ బాగా చేస్తాడ‌ని. అందుకు త‌గిన‌ట్టు బ‌న్ని కూడా త‌న సినిమాల్లో డ్యాన్సులు ప్ర‌త్యేకంగా ఉండేలా చూసుకుంటూ ఉంటాడు.

జెనీలియా రీ ఎంట్రీ...

బాయ్స్ స‌హా ప‌లు చిత్రాల్లో న‌టించిన జెనీలియాకు తెలుగు, త‌మిళంలో మంచి పేరు తెచ్చిన సినిమా 'బొమ్మ‌రిల్లు'.  హ హ హాసినిగా జెనీలియా ఇంకా గుర్తుంది.

సాయిధరమ్ తేజ్ తో పనిచేయడానికి నేను ఎప్పుడూ సిద్ధమే - ప్రసన్న

'జవాన్' సినిమాలో కేశవ అనే క్యారెక్టర్ కోసం రవిగారు కొత్త నటుడు కావాలని వెతుకుతున్నప్పుడు రచయితలు గోపీమోహన్, కోన వెంకట్ లు నా పేరును రవికి చెప్పారు.

డిసెంబర్ 28న 'ఒక్క క్షణం' ?

అల్లు శిరీష్ హీరోగా తెరకెక్కిన చిత్రం ‘ఒక్క క్షణం’. ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ చేసుకుని విడుదలకు సిద్ధంగా ఉంది. ‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’ డైరెక్టర్ వి.ఐ.ఆనంద్ రూపొందించిన ఈ సినిమా మంచి కథా కథనంతో ఆసక్తిగా ఉంటుందని వినికిడి.