లాంగ్ గ్యాప్ తర్వాత మళ్లీ సూర్య స్టెప్ , తెలుగు ఫ్యాన్స్ కోసమే.. ఫోటోలు వైరల్

  • IndiaGlitz, [Saturday,February 12 2022]

తమిళ్‌తో పాటు తెలుగులోనూ మంచి ఫాలోయింగ్ వున్న కోలీవుడ్ నటుల్లో సూర్య ఒకరు. ఆయన నటించిన ఎన్నో సినిమాలు తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో రిలీజ్ అవుతూ వస్తున్నాయి. కొన్ని సినిమాలు తమిళ్ కంటే తెలుగులోనే ఎక్కువ వసూళ్లు రాబట్టిన సందర్బాలు ఎన్నో. గతేడాది సూర్య నటించిన జై భీమ్ దక్షిణాదిని ఒక ఊపిన సంగతి తెలిసిందే. సూర్య 40వ సినిమాగా రూపొందిన ‘ జై భీమ్’ సినిమా అడివి బిడ్డలకు జరిగిన అన్యాయాన్ని కళ్లకు కట్టినట్లు చూపించింది. ఇందులో ఆయన లాయర్‌గా ఆకట్టుకున్నారు.

ఇక జైభీమ్ తర్వాత సూర్య నటిస్తున్న లేటేస్ట్ మూవీ ‘‘ఈటి’’(ఎతర్‌క్కుమ్‌ తునిందవన్). పాండీరాజ్‌ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. యాక్ష‌న్ థ్రిల్ల‌ర్‌గా తెర‌కెక్కుతున్న ఈ చిత్రాన్ని పాన్ ఇండియా లెవ‌ల్లో తెలుగు, త‌మిళం, క‌న్న‌డ‌, మ‌ల‌యాళం, భాష‌లతో పాటు హిందీలోనూ ఏక‌కాలంలో విడుద‌ల చేసేందుకు సన్నాహాకాలు చేస్తున్నారు. సూర్య సరసన అరుల్ మోహ‌న్ హీరోయిన్‌గా న‌టిస్తుండగా... డి. ఇమ్మ‌న్ సంగీతం అందిస్తున్నారు. ఈటీని మార్చి 10న ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురావాల‌ని ప్లాన్ చేస్తున్నారు.

తాజాగా ఈటీ మూవీ నుంచి ఓ అప్ డేట్ వచ్చింది. ఈ చిత్రానికి సంబంధించి తెలుగు వెర్షన్ కి సూర్య స్వయంగా తన డబ్బింగ్ ని తానే చెప్పుకుంటున్నారట. ఇందుకు సంబంధించి ఓ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సూర్య గతంలో “బ్రదర్స్” అనే సినిమాకు తనకు తానే డబ్బింగ్ చెప్పుకున్నారు. మళ్ళీ ఇన్నాళ్ళకి ఈటీ కోసం గొంతు సవరించుకుంటున్నారు. ఇక ‘‘ఈటీ’’ తెలుగు హక్కులను ఏషియన్ సినిమాస్ దక్కించుకున్నట్లుగా సమాచారం.

More News

వాస్తవ ఘటనల ఆధారంగా రూపొందిన పూనమ్ కౌర్ - నాగు గవర 'నాతిచరామి' ట్రైల‌ర్‌కు సూపర్బ్ రెస్పాన్స్

అరవింద్ కృష్ణ, పూనమ్ కౌర్, సందేశ్ బురి ప్రధాన తారాగణంగా నాగు గవర దర్శకత్వం వహించిన సినిమా 'నాతిచరామి'.

భారత కార్పోరేట్ రంగంలో విషాదం.. దిగ్గజ పారిశ్రామికవేత్త రాహుల్ బజాజ్ కన్నుమూత

ప్రముఖ పారిశ్రామికవేత్త, బజాజ్‌ గ్రూప్ మాజీ ఛైర్మన్ రాహుల్ బజాజ్ కన్నుమూశారు. ఆయన వయసు 83 సంవత్సరాలు.

ప్రయాణీకులకు గుడ్‌న్యూస్.. హైదరాబాద్ మెట్రో స్టేషన్లలో జనరిక్‌ మెడికల్‌ షాపులు

ప్రయాణీకులను ఆకట్టుకునేందుకు హైదరాబాద్ మెట్రో రైలు సరికొత్త ప్రణాళికలు రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా మెట్రో స్టేషన్‌లలో జనరికల్ మెడికల్ షాపులను అందుబాటులోకి తెచ్చింది

బాలీవుడ్ ఇక అంతమే.. టాలీవుడ్‌దే ఆ ప్లేస్, ఎప్పుడో చెప్పా: పాయల్ కామెంట్స్ వైరల్

దేశంలో ఇప్పుడు తెలుగు సినిమా ప్రభ వెలుగొందుతోంది. కమర్షియల్ సినిమాలు తప్పించి.. భారీ బడ్జెట్, ప్రయోగాత్మక సినిమాలు తీయలేరంటూ విమర్శలు చేసినవారు

షూటింగ్‌లో తీవ్రంగా గాయపడిన విశాల్.. ఆసుపత్రికి తరలింపు

మనకి రెండు గంటల పాటు వినోదం అందించేందుకు హీరోలు, హీరోయిన్లు ఎంతో కష్టపడతారు. ఈ క్రమంలో ప్రాణాలు పొగొట్టుకున్న వారు కూడా వున్నారు.