లాంగ్ గ్యాప్ తర్వాత మళ్లీ సూర్య స్టెప్ , తెలుగు ఫ్యాన్స్ కోసమే.. ఫోటోలు వైరల్
Send us your feedback to audioarticles@vaarta.com
తమిళ్‌తో పాటు తెలుగులోనూ మంచి ఫాలోయింగ్ వున్న కోలీవుడ్ నటుల్లో సూర్య ఒకరు. ఆయన నటించిన ఎన్నో సినిమాలు తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో రిలీజ్ అవుతూ వస్తున్నాయి. కొన్ని సినిమాలు తమిళ్ కంటే తెలుగులోనే ఎక్కువ వసూళ్లు రాబట్టిన సందర్బాలు ఎన్నో. గతేడాది సూర్య నటించిన జై భీమ్ దక్షిణాదిని ఒక ఊపిన సంగతి తెలిసిందే. సూర్య 40వ సినిమాగా రూపొందిన ‘ జై భీమ్’ సినిమా అడివి బిడ్డలకు జరిగిన అన్యాయాన్ని కళ్లకు కట్టినట్లు చూపించింది. ఇందులో ఆయన లాయర్‌గా ఆకట్టుకున్నారు.
ఇక జైభీమ్ తర్వాత సూర్య నటిస్తున్న లేటేస్ట్ మూవీ ‘‘ఈటి’’(ఎతర్క్కుమ్ తునిందవన్). పాండీరాజ్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని పాన్ ఇండియా లెవల్లో తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, భాషలతో పాటు హిందీలోనూ ఏకకాలంలో విడుదల చేసేందుకు సన్నాహాకాలు చేస్తున్నారు. సూర్య సరసన అరుల్ మోహన్ హీరోయిన్గా నటిస్తుండగా... డి. ఇమ్మన్ సంగీతం అందిస్తున్నారు. ఈటీని మార్చి 10న ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నారు.
తాజాగా ఈటీ మూవీ నుంచి ఓ అప్ డేట్ వచ్చింది. ఈ చిత్రానికి సంబంధించి తెలుగు వెర్షన్ కి సూర్య స్వయంగా తన డబ్బింగ్ ని తానే చెప్పుకుంటున్నారట. ఇందుకు సంబంధించి ఓ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సూర్య గతంలో “బ్రదర్స్” అనే సినిమాకు తనకు తానే డబ్బింగ్ చెప్పుకున్నారు. మళ్ళీ ఇన్నాళ్ళకి ఈటీ కోసం గొంతు సవరించుకుంటున్నారు. ఇక ‘‘ఈటీ’’ తెలుగు హక్కులను ఏషియన్ సినిమాస్ దక్కించుకున్నట్లుగా సమాచారం.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com