పోస్టర్ తో సెన్సేషన్ క్రియేట్ చేస్తున్న సూర్య
Send us your feedback to audioarticles@vaarta.com
సూర్య నటిస్తున్న తాజా చిత్రం 24. ఈ చిత్రాన్ని మనం ఫేం విక్రమ్ కుమార్ తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రాన్ని సూర్య నిర్మిస్తుండడం విశేషం. పాత్ర డిమాండ్ చేయాలే కానీ...ఎలాంటి పాత్ర చేయడానికైనా సూర్య రెడీ. గతంలో పేరళగన్ సినిమాలో గునివాడిగా..గజిని సినిమాలో షార్ట్ టైమ్ మెమరీ లాస్ పేషెంట్ గా నటించిన విషయం తెలిసిందే. అలాగే సూర్య సన్నాఫ్ కృష్ణన్ సినిమాలో టీనేజ్ కుర్రాడిలా, యువకుడుగా, వృధ్దుడులా..మూడు విభిన్న పాత్రల్లో నటించి మెప్పించాడు.
ఇక అసలు విషయానికి వస్తే...24 సినిమాలో కూడా సూర్య మూడు డిఫరెంట్ పాత్రల్లో కనిపించనున్నాడు. తాజాగా రిలీజ్ చేసిన 24 మూవీ పోస్టర్ సినిమాపై మరింత ఆసక్తిని పెంచింది. డిఫరెంట్ గెటప్ లో ఉన్న సూర్య 24 మూవీని సమ్మర్ లో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాలో సూర్య సరసన సమంత, నిత్యా మీనన్ నటిస్తున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com