పాక్‌కు చిక్కిన భారత్ పైలట్‌పై సూర్య బ్రదర్స్ ట్వీట్

  • IndiaGlitz, [Thursday,February 28 2019]

భారత వాయుసేన పైలట్‌ అభినందన్‌ వీరోచిత పోరాటం చేసి పాకిస్థాన్‌ సైన్యానికి చిక్కిన సంగతి తెలిసిందే. అయితే ఆయన క్షేమంగా తిరిగి రావాలని యావత్ ప్రపంచం ప్రార్థనలు చేస్తోంది. ఈ సందర్భంగా పలువురు ప్రముఖులు అభినందన్‌‌ను ఉద్దేశించి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున పోస్ట్‌లు చేశారు. ఈ సందర్భంగా సినీ ఇండస్ట్రీకి చెందిన నటీనటులు ఆయన కోసం ప్రార్థనలు కూడా చేశారు.. చేస్తున్నారు కూడా. టాప్ హీరో సూర్య బ్రదర్స్‌ అభినందన్‌‌ వర్థమాన్‌పై ట్వీట్స్ చేశారు. కాగా.. అభినందన్‌ స్వగ్రామం చెన్నై అనే విషయం తెలిసిందే.

సూర్య ట్వీట్..

సెల్యూట్.. కమాండర్ అభినందన్‌ వర్థమాన్. మిమ్మల్ని చూస్తుంటే చాలా గర్వంగా ఉంది. మీరు ఇదే ధైర్యంతో ఉండండి. యావత్ భారత జాతి మీతో ఉంది. మీరే క్షేమంగా తిరిగి రావాలనే మా ప్రార్థలన్నీ అని సూర్య ట్వీట్ చేశారు.

హీరో కార్తి ట్వీట్..

ఇండియన్‌ ఎయిర్‌ఫోర్స్‌‌కు చెందిన ఫైలట్‌‌ వీరులను ఒకానొక సందర్భంలో కలవడం నా అదృష్టం. ఆ ఫైలట్స్‌ గురించి తెలుసుకోవడం చాలా గౌరవంగా ఉంది. మన పోరాట యోధులు క్షేమంగా తిరిగి నేను హృదయపూర్వకంగా ప్రార్థిస్తున్నాను. యావత్ భారత్.. సైనికుల కుటుంబాలకు అండగా ఉంటుంది. మన దేశం కోసం జీవితాన్ని త్యాగం చేసిన ఆ వీరులను క్షేమంగా ఇండియాకు తీసుకురావాలి.. రావాలి అని కార్తి ట్వీట్ చేశారు.

More News

సైరా..ఇక నాలుగు రోజులే!

చిరంజీవి టైటిల్ పాత్రలో నటిస్తోన్న చిత్రం ‘సైరా నరసింహారెడ్డి’. బ్రిటీష్ వారికి ఎదురు తిరిగిన తొలి స్వాతంత్య్ర యోధుడు ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా ఈ సినిమా రూపొందుతోంది.

'డియర్ కామ్రేడ్' సంద‌డి అప్పుడే

`పెళ్ళిచూపులు`తో స‌క్సెస్‌కొట్టి `అర్జున్‌రెడ్డి`తో తిరుగులేని క్రేజ్‌ను సొంతం చేసుకున్న కుర్ర హీరో విజ‌య్ దేవ‌రకొండ‌ను `గీత గోవిందం` స్టార్ హీరోగా మార్చేసింది.

గుడ్‌న్యూస్: విశాఖకు రైల్వేజోన్ ఇచ్చిన కేంద్రం

ఆంధ్రప్రదేశ్‌‌లోని విశాఖకు రైల్వేజోన్ ఇస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. బుధవారం రాత్రి ఈ విషయాన్ని కేంద్ర రైల్వే శాఖ మంత్రి పియూష్ గోయల్‌‌ అధికారికంగా ఓ ప్రకటన

జగన్‌ గృహప్రవేశానికి కీలకనేత డుమ్మా..!

వైసీపీ అధినేత, ఏపీ ప్రధాన ప్రతిపక్షనేత వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి బుధవారం రోజున అమరావతిలోని కొత్త ఇంట్లోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే.

సైన్యం సాహసాలను రాజకీయాల కోసం వాడుకోవద్దు!

సైన్యం సాహసాలను రాజకీయాలకోసం వాడుకోవడం సరికాదని కేంద్ర ప్రభుత్వవానికి విపక్షాలు సూచించాయి. బుధవారం సాయంత్రం విపక్ష పార్టీల సమావేశం జరిగింది.