Surya : సూర్య 42' మోషన్ పోస్టర్ రిలీజ్
Send us your feedback to audioarticles@vaarta.com
యాక్షన్ ఎంటర్ టైనర్స్ ను ఇన్ స్పైర్ చేసేలా సౌత్ స్టార్ సూర్య కొత్త సినిమా సూర్య 42 మోషన్ పోస్టర్ వచ్చేసింది. కేఈ జ్ఞానవేల్ రాజా సగర్వ సమర్పణలో ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్ పతాకంపై వంశీ, ప్రమోద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ మైటీ వైలెంట్ సాగాకు శివ వహిస్తున్నారు. మోషన్ పోస్టర్ లోని గ్రాండియర్ చూస్తుంట ఇండియన్ స్క్రీన్ మీద ఇదొక ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ గా రానుందని తెలుస్తోంది. సూర్య లుక్, అద్భుమైన మూవీ డిజైనింగ్, అన్ కాంప్రమైజ్డ్ మేకింగ్ తో సూర్య 42 ఫరెవర్ స్పెషల్ మూవీ కాబోతోంది. చిత్ర నిర్మాణంలో కేఈ జ్ఞానవేల్ రాజా, యూవీ క్రియేషన్స్ అభిరుచిని ఎన్నో సూపర్ హిట్ చిత్రాలు ప్రదర్శించాయి.
ఆగస్టు 8న ప్రారంభమైన ఈ సినిమా అదే రోజు రెగ్యులర్ చిత్రీకరణ ప్రారంభించుకుంది. ఈ చిత్రాన్ని 10 భాషల్లో ప్రేక్షకుల ముందుకు
తీసుకొచ్చేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. దిశా పటానీ నాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో యోగిబాబు, రెడిన్ కింగ్స్లే, కోవై సరళ తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నారు.
సూర్య అభిమానులకు 2022 బెస్ట్ ఇయర్ గా నిలిచిపోతుంది. ఆయనకు జాతీయ ఉత్తమ నటుడిగా సురరై పొట్రుకు అవార్డ్ దక్కడం, ఆస్కార్ జ్యూరీలో మెంబర్ గా సెలెక్ట్ అవడం, విక్రమ్ లో రోలెక్స్ గా మెరవడం..ఇవన్నీ ఫ్యాన్స్ ను ఖుషి చేశాయి. ఇప్పుడీ భారీ యాక్షన్ ఎంటర్ టైనర్ తో అభిమానుల ఉత్సాహం మరింత పెరుగుతోంది.ఈ సినిమా రిలీజ్ డేట్ ను త్వరలోనే అనౌన్స్ చేయనున్నారు.
ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ - వెట్రి పళనిసామి, ఆర్ట్ - మిలన్, ఎడిటర్ - నిషాద్ యూసుఫ్, స్టంట్స్ - సుప్రీం సుందర్, మాటలు - మదన్ కార్కీ, - శోభి, పీఆర్వో - జీఎస్కే మీడియా, బ్యానర్స్ - స్టూడియో , యూవీ క్రియేషన్స్, నిర్మాతలు - కేఈ జ్ఞానవేల్ రాజా, వంశీ - , దర్శకత్వం - శివ
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments