Surya : సూర్య 42' మోషన్ పోస్టర్ రిలీజ్

  • IndiaGlitz, [Saturday,September 10 2022]

యాక్షన్ ఎంటర్ టైనర్స్ ను ఇన్ స్పైర్ చేసేలా సౌత్ స్టార్ సూర్య కొత్త సినిమా సూర్య 42 మోషన్ పోస్టర్ వచ్చేసింది. కేఈ జ్ఞానవేల్ రాజా సగర్వ సమర్పణలో ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్ పతాకంపై వంశీ, ప్రమోద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ మైటీ వైలెంట్ సాగాకు శివ వహిస్తున్నారు. మోషన్ పోస్టర్ లోని గ్రాండియర్ చూస్తుంట ఇండియన్ స్క్రీన్ మీద ఇదొక ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ గా రానుందని తెలుస్తోంది. సూర్య లుక్, అద్భుమైన మూవీ డిజైనింగ్, అన్ కాంప్రమైజ్డ్ మేకింగ్ తో సూర్య 42 ఫరెవర్ స్పెషల్ మూవీ కాబోతోంది. చిత్ర నిర్మాణంలో కేఈ జ్ఞానవేల్ రాజా, యూవీ క్రియేషన్స్ అభిరుచిని ఎన్నో సూపర్ హిట్ చిత్రాలు ప్రదర్శించాయి.

ఆగస్టు 8న ప్రారంభమైన ఈ సినిమా అదే రోజు రెగ్యులర్ చిత్రీకరణ ప్రారంభించుకుంది. ఈ చిత్రాన్ని 10 భాషల్లో ప్రేక్షకుల ముందుకు
తీసుకొచ్చేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. దిశా పటానీ నాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో యోగిబాబు, రెడిన్ కింగ్స్లే, కోవై సరళ తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నారు.

సూర్య అభిమానులకు 2022 బెస్ట్ ఇయర్ గా నిలిచిపోతుంది. ఆయనకు జాతీయ ఉత్తమ నటుడిగా సురరై పొట్రుకు అవార్డ్ దక్కడం, ఆస్కార్ జ్యూరీలో మెంబర్ గా సెలెక్ట్ అవడం, విక్రమ్ లో రోలెక్స్ గా మెరవడం..ఇవన్నీ ఫ్యాన్స్ ను ఖుషి చేశాయి. ఇప్పుడీ భారీ యాక్షన్ ఎంటర్ టైనర్ తో అభిమానుల ఉత్సాహం మరింత పెరుగుతోంది.ఈ సినిమా రిలీజ్ డేట్ ను త్వరలోనే అనౌన్స్ చేయనున్నారు.

ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ - వెట్రి పళనిసామి, ఆర్ట్ - మిలన్, ఎడిటర్ - నిషాద్ యూసుఫ్, స్టంట్స్ - సుప్రీం సుందర్, మాటలు - మదన్ కార్కీ, - శోభి, పీఆర్వో - జీఎస్కే మీడియా, బ్యానర్స్ - స్టూడియో , యూవీ క్రియేషన్స్, నిర్మాతలు - కేఈ జ్ఞానవేల్ రాజా, వంశీ - , దర్శకత్వం - శివ

More News

కెప్టెన్‌గా బాలాదిత్య... వరస్ట్ పర్ఫార్మర్‌గా గీతూ రాయల్ , ‘అతి’ కొంపముంచిందిగా

నిన్నటి ఎపిసోడ్‌లో మేరీనా - రోహిత్‌ల గిల్లికజ్జాలు, తనను అందరూ కలిసి ఒంటిరివాడిని చేశారన్న రేవంత్ ఫ్రస్ట్రేషన్ చూశాం.

Balapur Laddu Auction: బాలాపూర్ గణేషుడి లడ్డూ వేలం.. పాత రికార్డులన్నీ బ్రేక్, ఎంతో తెలుసా.??

హైదరాబాద్‌లో గణేశ్ శోభాయాత్ర వైభవంగా జరుగుతోంది. ఈ క్రమంలో భాగ్యనగరానికే ప్రత్యేకమైన బాలాపూర్ లడ్డూకి వేలంలో రికార్డు ధర దక్కింది. శుక్రవారం జరిగిన వేలం పాటలో

Munugode ByPoll : విధేయతకు పట్టం.. మునుగోడు కాంగ్రెస్ అభ్యర్ధిగా పాల్వాయి స్రవంతి

కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామా కారణంగా మునుగోడులో ఉపఎన్నిక అనివార్యమైన సంగతి తెలిసిందే. ఇక్కడి నుంచి బీజేపీ అభ్యర్ధిగా కోమటిరెడ్డి బరిలోకి దిగుతున్నారు.

యాక్ట్ చేస్తూ బతకడం రాదు.. కంటెస్టెంట్స్‌పై విరుచుకుపడ్డ రేవంత్

నిన్నటి ఎపిసోడ్‌లో ప్రధాన ఘట్టమైన నామినేషన్ల ప్రాసెస్ ముగిసింది. మొదటి వారం నామినేషన్స్‌లో అత్యధికంగా ఓట్లు ఉన్న రేవంత్‌, చంటి, శ్రీసత్య, ఫైమాలు, ట్రాష్ ద్వారా వచ్చిన ఇనయా,

Queen Elizabeth II: క్వీన్ ఎలిజబెత్ 2 కన్నుమూత.. 70 ఏళ్ల పాటు బ్రిటన్‌ను పాలించిన "మహారాజ్ఞి"

బ్రిటన్ రాజకుటుంబంలో విషాదం చోటు చేసుకుంది. ఆ దేశ రాణి క్వీన్ ఎలిజబెత్ 2 కన్నుమూశారు. ఆమె వయసు 96 సంవత్సరాలు. వృద్ధాప్య సంబంధిత సమస్యలతో క్వీన్ గురువారం రాత్రి