ఓ డైరెక్టర్ నా క్లీవేజ్ చూడాలన్నాడు.. మరొకడు ఏకంగా..
Send us your feedback to audioarticles@vaarta.com
బుల్లితెరపై నటిగా గుర్తింపు తెచ్చుకున్న సుర్వీన్ చావ్లా ఆ తర్వాత వెండితెరపై కూడా మెరిసింది. ఇటీవల కాలంలో హీరోయిన్లకు కాస్టింగ్ కౌచ్ అనేది శాపంగా మారుతోంది. నటీమణులని అవకాశాల పేరుతో లోబరుచుకోవడం, వారిని లైంగికంగా వేధించడం లాంటి సంఘటనలు తరచుగా అన్ని చిత్ర పరిశ్రమల్లో చోటు చేసుకుంటున్నాయి.
ఇదీ చదవండి: ఫిలిం క్రిటిక్ కత్తి మహేష్ కు ప్రమాదం.. లారీని ఢీకొన్న కారు!
తాజాగా హీరోయిన్ సుర్వీన్ చావ్లా తనకు ఎదురైన కాస్టింగ్ కౌచ్ సంఘటనలని వివరించింది. సౌత్ లో మూడు సార్లు కాస్టింగ్ కౌచ్ సంఘటనలు ఎదురయ్యాయని సుర్వీన్ తెలిపింది. సౌత్ లో జాతీయ అవార్డు పొందిన ఓ ప్రముఖ దర్శకుడు తనని వేధించినట్లు సుర్వీన్ రివీల్ చేసింది.
ఆ దర్శకుడు తన సినిమాలో అవకాశం ఇచ్చారు. దీనితో ఆడిషన్స్ కోసం వెళ్లగా ఆ దర్శకుడి ప్రవర్తన వింతగా అనిపించినట్లు సుర్వీన్ పేర్కొంది. రోజంతా ఆడిషన్స్ తోనే గడపడంతో ఒంట్లో బాగాలేనట్లు అనిపించింది. దీనితో తిరిగి నేను ముంబై వచ్చేశాను.
అప్పటి నుంచి ఆ డైరెక్టర్ పదే పదే ఫోన్స్ చేయడం ప్రారంభించారు. నీకు ఒంట్లో బాగాలేదు అన్నవుగా.. ముంబైకి నన్ను రమ్మంటావా అని అడిగాడు. వద్దని చెప్పి ఫోన్ పెట్టేశా. కొన్ని రోజులకు మళ్ళీ అదే నంబర్ నుంచి కాల్ వచ్చింది. ఈసారి వేరే వ్యక్తి మాట్లాడాడు.
సినిమా స్టార్ట్ కావడానికి టైం పడుతుంది. ఈ లోపు దర్శకుడు మీ గురించి పూర్తిగా తెలుసుకోవాలని అనుకుంటున్నారు. ఇది సినిమా పూర్తయ్యే వరకు మాత్రమే అని చెప్పాడు. దీనితో వారి ఉద్దేశం నాకు అర్థం అయింది. నా ప్రతిభని మాత్రమే మాత్రమే దృష్టిలో పెట్టుకుని అవకాశం ఇవ్వండి లేదంటే లేదు అని గట్టిగా సమాధానం ఇచ్చి ఫోన్ పెట్టేసినట్లు సుర్వీన్ తెలిపింది.
ఇక రీసెంట్ గా బాలీవుడ్ లో కూడా ఇలాంటి ఘటనలు ఎదురైనట్లు సుర్వీన్ చెప్పుకొచ్చింది. ఓ ఫిలిం మేకర్ తన క్లీవేజ్ చూడాలని అడిగాడు. మరొక దర్శకుడు నా శరీరం మొత్తం ప్రతి అణువు తెలుసుకోవాలని అడిగినట్లు సుర్వీన్ తనకు ఎదురైన కాస్టింగ్ కౌచ్ సంఘటనలని వివరించింది. తెలుగులో సుర్వీన్ చావ్లా మోహన్ బాబు చిత్రం రాజు మహారాజులో నటించింది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com