సర్ ప్రైజ్ : బాలయ్యకు యువరాజ్ సింగ్ బర్త్ డే విషెష్!

నందమూరి నటసింహం బాలకృష్ణ గురువారం తన 61వ బర్త్ డే సెలెబ్రేట్ చేసుకుంటున్న సంగతి తెలిసిందే. ఆయనకు అభిమానుల నుంచి శుభాకాంక్షలు వెల్లువలా వస్తున్నాయి. సినీ ప్రముఖులంతా బాలయ్యని విష్ చేస్తున్నారు. కానీ ఊహించని విధంగా ఓ వ్యక్తి నుంచి బాలయ్యకు జన్మదిన శుభాకాంక్షలు అందాయి.

ఇదీ చదవండి: ఎద సౌందర్యం కోసం అసభ్యకరమైన పని చేయమన్నారు: హీరోయిన్

అతనెవరో కాదు దేశం మొత్తం అభిమానుల మనసు గెలుచుకున్న మాజీ స్టార్ క్రికెటర్ యువరాజ్ సింగ్. అవును ఇది నిజమే.. స్వయంగా యువరాజ్ తన ట్విటర్ ఖాతా ద్వారా బాలయ్యకు బర్త్ డే విషెష్ తెలియజేశాడు. బాలయ్యని గతంలో కలసిన ఓ పిక్ ని షేర్ చేశాడు యువరాజ్.

యువరాజ్ బర్త్ డే విషెష్ తెలియజేయడంతో నందమూరి అభిమానుల్లో జోష్ పెరిగింది. 'హ్యాపీ బర్త్ డే నందమూరి బాలకృష్ణ సర్. మీ పెర్ఫామెన్స్ తో మమ్మల్ని ఎంటర్టైన్ చేస్తూ, సేవా కార్యక్రమాలతో ఇన్స్పైర్ చేస్తూ ఉండండి' అని యువరాజ్ ట్వీట్ చేశాడు.

కొన్నేళ్ల క్రితం బాలకృష్ణని యువరాజ్ సింగ్ హైదరాబాద్ లో కలిశారు. బాలకృష్ణ ఆధ్వర్యంలో బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి నడుస్తున్న సంగతి తెలిసిందే. క్యాన్సర్ పై అవేర్నెస్ పెంచేందుకు ఆ టైంలో యువరాజ్ బాలయ్యతో చేతులు కలిపాడు.

యువరాజ్ కూడా గతంలో క్యాన్సర్ బారీన పడ్డ సంగతి తెలిసిందే. వైద్యం చేయించుకున్న తర్వాత కోలుకుని తిరిగి క్రికెట్ లో రాణించాడు.