'S3-యముడు-3' విడుదల తేదీ
Send us your feedback to audioarticles@vaarta.com
వినూత్నమైన కథాంశాలతో పాత్రలో పరకాయ ప్రవేశం చేసి స్టార్ క్రేజ్‌ను సంపాందించుకున్న సూర్య, శ్రుతిహసన్, అనుష్కలు జంటగా నటిస్తున్న చిత్రం 'S3-యముడు-3'. తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో నిర్మిస్తున్న ఈ చిత్రానికి హరి దర్శకుడు. గతంలోయముడు, సింగం చిత్రాలు ఘనవిజయాలు సాధించిన విషయం తెలిసిందే.
ఇప్పడు ఆదే సిరీస్‌లో భాగంగా రూపొందుతున్న ఈ చిత్రాన్నిస్టూడియో గ్రీన్ పతాకంపై కె.ఇ.జ్ఞానవేల్‌రాజా సగర్వంగా సమర్పిస్తూ తెలుగులో సురక్ష్ ఎంటర్‌టైన్‌మెంట్స్ అధినేత మల్కాపురం శివకుమార్ నిర్మిస్తున్నారు. హారిస్ జైరాజ్ అందించిన ఆడియో ఇప్పటికే విడుదలై సూపర్‌హిట్ ఆడియోగా ప్రేక్షకుల ప్రశంసలు పొందుతుంది. అన్ని కార్యక్రమాలు పూర్తిచేసి జనవరి 26 న ప్రేక్షకుల ముందుకు తీసుకురావటానికి నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.
ఈ సందర్భంగా నిర్మాత మల్కాపురం శివకుమార్ మాట్లాడుతూ.. తమిళ, తెలుగు బాషల్లో తన నటనతో , తనకంటూ ప్రత్యేక అభిమానుల్ని సంపాదించుకున్న సూర్య, హరి కాంబినేషన్‌లో రూపొందిన యముడు, సింగం చిత్రాలు ఘనవిజయాల్ని సాధించాయి. వాటికి కొనసాగింపుగా వస్తోన్న చిత్రం "S3-యముడు-3" . డైరక్టర్ హరి గారు ఈ చిత్రాన్ని మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కించారు. పరుగులు పెట్టే స్క్రీన్‌ప్లే తో థ్రిల్ ని కలిగించే సన్నివేశాలతో చిత్రం కొనసాగుతుంది. తెలుగు ప్రేక్షకుల్లో హరి స్క్రీన్‌ప్లే కి కూడా ఫ్యాన్స్ వుండటం విశేషం, ఇప్పటికే విడుదలైన టీజర్స్ చూసిన తర్వాత ప్రేక్షకుల్లో అంచనాలు భారీగా పెరిగాయి. వారి అంచనాలను అందుకునేలా మా చిత్రం వుండబోతుంది. సూర్య గారు పవర్‌ఫుల్ పోలీస్ గా యాక్షన్ తో మరొక్కసారి విజృంభించారు. అనుష్క నటనకి ఈసారి శ్రుతిహసన్ గ్లామర్ అడిషనల్ గా ప్రేక్షకుల్ని అలరించనుంది. నీతి నిజాయితీలే ఊపిరిగా భావించే ఓ పోలీస్ అధికారి వృత్తి నిర్వహణలో తనకు ఎదురైన సవాళ్లను ఎలా ఎదుర్కొన్నాడన్నదే ఈ చిత్ర ఇతివృత్తం. తెలుగు వెర్షన్ లో మా సంస్థ పార్ట్ అయినందుకు చాలా అనందంగా వుంది. హేరిస్ జైరాజ్ అందించిన ఆడియో కి చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది. చిత్రాన్ని అన్ని కార్యక్రమాలు పూర్తిచేసి జనవరి 26న మా బ్యానర్ ద్వారా తెలుగు వెర్షన్ ని విడుదల చేస్తున్నాము. రాధికా శరత్‌కుమార్, నాజర్, రాడాన్ రవి, సుమిత్ర ముఖ్యపాత్రల్లో నటిస్తున్నారు. అని అన్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com