నవంబర్‌లో సూర్య...
Send us your feedback to audioarticles@vaarta.com
సెల్వ రాఘవన్ `ఎన్.జి.కె` సినిమా తర్వాత సూర్య, కె.వి.ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సినిమాతో బిజీగా ఉన్నాడు. ఈ సినిమాలో కూడా సూర్య పార్ట్ పూర్తి కావస్తుంది. అయితే సూర్య ఎక్కువ గ్యాప్ తీసుకోవడం లేదు. వెంటనే మరో సినిమాలో నటించడానికి రెడీ అయిపోతున్నారు.
`ఇరుదు సుట్రు`(తెలుగులో `గురు`) చిత్రాన్ని తెరకెక్కించిన లేడీ డైరెక్టర్ సుధా కొంగర దర్శకత్వంలో సూర్య సినిమా చేయబోతున్నారు. ఇప్పటికే స్క్రిప్ట్ అంతా సిద్ధమైంది. నవంబర్ నుండి సినిమా రెగ్యులర్ షూటింగ్ జరగనుంది. సూర్య తన స్వంత నిర్మాణ సంస్థ 2డి ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్‌లో ఈ సినిమాను నిర్మిస్తారు. వచ్చే ఏడాది ద్వితీయార్థంలో సినిమా విడుదలయ్యే అవకాశాలున్నాయి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments