సూర్య కమిట్‌మెంటే వేర‌ప్పా!!

  • IndiaGlitz, [Thursday,April 16 2020]

తమిళంతో పాటు తెలుగులోనూ మార్కెట్ ఉన్న హీరోల్లో సూర్య ఒక‌రు. అందుక‌నే ఆయ‌న సినిమాలు త‌మిళంతో పాటు తెలుగులోనూ ఏకకాలంలో విడుద‌ల‌వుతుంటాయి. అయితే ఈ మ‌ధ్య కాలంలో విడుద‌లైన సూర్య సినిమాలు ఎన్‌జీకే, బందోబ‌స్త్‌(కాప్పాన్‌) చిత్రాలు ఆశించిన స్థాయిలో విజ‌య‌వంతం కాలేపోయాయి. అయితే ఈ ఏడాది స‌మ్మ‌ర్‌లో 'ఆకాశం నీ హ‌ద్దురా' సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకు రావాలనుకున్న సూర్య స్పీడుకు కరోనా వైరస్ బ్రేకేసింది.

గురు ఫేమ్ సుధా కొంగ‌ర తెర‌కెక్కించిన ఈ సినిమాలో 40 ఏళ్ల సూర్య ఎలాంటి వ‌ర్క‌వుట్స్ చేశాడు. 40 ఏళ్ల వ్య‌క్తి 19 ఏళ్ల వ్య‌క్తిగా ఎలా మారాడు అనే దానిపై చిత్ర యూనిట్ ఓ వీడియోను విడుద‌ల చేసింది. సూర్య క‌మిట్‌మెంట్ చూసిన వాళ్లంద‌రూ శ‌భాష్ అంటున్నారు. ఆయ‌న ఎలాంటి ఎక్స‌ర్‌సైజులు చేశారు. ఎలాంటి డైట్ తీసుకున్నార‌నే విష‌యాన్ని ఇందులో చూపించారు. క‌రోనా ప్ర‌భావం త‌గ్గిన త‌ర్వాత ఆకాశం నీహ‌ద్దురా సినిమా విడుద‌ల తేదీపై సూర్య అండ్ టీమ్ ఓ క్లారిటీని ఇవ్వ‌నున్నారు. అలాగే సూర్య డైరెక్ట‌ర్ హ‌రి ద‌ర్శ‌క‌త్వంలో అరువా అనే సినిమాను చేయ‌బోతున్నారు. అలాగే వెట్రిమార‌న్ ద‌ర్శ‌క‌త్వంలోనూ సూర్య మ‌రో సినిమా చేయ‌బోతున్నాడు.