వరల్డ్ రికార్డ్ తో సూర్య సంచలనం.. సమంత రియాక్షన్
Send us your feedback to audioarticles@vaarta.com
కలెక్షన్లు, క్రేజ్ పరంగా ఎన్నో చిత్రాలు విజయం సాధిస్తుంటాయి. కానీ కొన్ని సినిమాలకు మాత్రమే గొప్ప సినిమా అనే గుర్తింపు లభిస్తుంది. సుధా కొంగర దర్శకత్వంలో సూర్య హీరోగా నటించిన 'ఆకాశం నీ హద్దురా' (సూరరై పోట్రు) ఖచ్చితంగా ఒక మాస్టర్ పీస్ అనే చెప్పాలి.
సామాన్యుడికి సైతం విమాన ప్రయాణం అందుబాటులో ఉండాలని కలగన్న కెప్టెన్ గోపినాథ్ జీవిత చరిత్ర ఆధారంగా సుధా కొంగర ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. సూర్య హీరోగా నటించగా, అపర్ణ బాలమురళి ఫిమేల్ లీడ్ గా నటించింది. కరోనా కారణంగా గత ఏడాది ఈ చిత్రాన్ని నేరుగా అమెజాన్ ప్రైమ్ లో విడుదల చేశారు.
అటు ప్రేక్షకులతో పాటు సినీప్రముఖులు, క్రిటిక్స్ నుంచి కూడా ఈ చిత్రం ప్రశంసలు దక్కించుకుంది. తాజాగా ఈ చిత్రం చరిత్రలో నిలిచిపోయే ప్రపంచ రికార్డ్ సొంతం చేసుకుంది. ప్రముఖ మూవీ రేటింగ్ సంస్థ ఐఎండిబిలో ఈ చిత్రం ప్రపంచంలోనే మూడవ స్థానంలో నిలిచింది. 9.3 స్టార్ రేటింగ్ తో ది షశాంక్ రిడంప్షన్ తొలి స్థానంలో ఉండగా, ది గడ్ ఫాదర్ మూవీ 9.2 రేటింగ్ తో రెండవ స్థానంలో ఉంది.
ఈ రెండు చిత్రాల తర్వాత ఆకాశం నీ హద్దురా (సూరరై పోట్రు) సంచలనంగా 9.1 రేటింగ్ తో మూడవ స్థానం దక్కించుకుంది. ఇది హాలీవుడ్ వర్గాలు సైతం ఆశ్చర్యపోయే రికార్డ్. దీనితో సూర్య అభిమానులు సోషల్ మీడియాలో సంబరాలు చేసుకుంటున్నారు.
సినీ ప్రముఖులు ఆకాశం నీ హద్దురా చిత్ర యూనిట్ కి అభినందనలు తెలియజేస్తున్నారు. ' తమిళ చిత్రం ప్రపంచంలోనే ఐఎండిబిలో అత్యధిక రేటింగ్ సాధించిన మూడవ చిత్రంగా రికార్డ్ సృష్టించింది' అని సమంత పోస్ట్ పెట్టింది. 'సూర్య సర్ అభిమానిగా ఇది చూసి చాలా సంతోషించాను. ఈ చిత్రంలో ప్రతి అంశం నాకు నచ్చింది' అని అల్లు సిరీస్ స్పందించాడు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com