క‌లిసొచ్చిన ద‌ర్శ‌కుడితో సూర్య‌

  • IndiaGlitz, [Tuesday,June 12 2018]

అనువాద చిత్రాల‌తోనే తెలుగు ప్రేక్ష‌కులకు ద‌గ్గ‌రైన త‌మిళ క‌థానాయ‌కుడు సూర్య‌. గ‌జిని, సూర్య స‌న్నాఫ్ కృష్ణ‌న్‌, వీడొక్క‌డే, య‌ముడు, సింగం, 24 చిత్రాలు సూర్య‌కి ప్ర‌త్యేక గుర్తింపు తీసుకువ‌చ్చాయి.

ఇదిలా ఉంటే.. సూర్య వ‌రుస సినిమాలు అంగీక‌రిస్తూ వార్త‌ల్లో నిలుస్తున్నారు. ప్ర‌స్తుతం సూర్య త‌న 36 వ చిత్రాన్ని సెల్వ రాఘ‌వ‌న్ ద‌ర్శ‌క‌త్వంలో ఎన్‌.జి.కె పేరుతో చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఇక 37వ చిత్రాన్ని కె.వి.ఆనంద్ ద‌ర్శ‌క‌త్వంలో చేయ‌బోతున్నారు. అలాగే 38వ చిత్రాన్ని వెంక‌టేష్‌తో గురు చిత్రాన్ని రూపొందించిన సుధ కొంగ‌ర ద‌ర్శ‌క‌త్వంలో చేసేందుకు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చారు.

ఈ చిత్రాల‌న్నీ ఓ కొలిక్కి రాక‌ముందే.. త‌న 39వ చిత్రానికి కూడా ఆయ‌న ఓకే చెప్పార‌ని కోలీవుడ్ వ‌ర్గాలు పేర్కొంటున్నాయి. తాజా స‌మాచారం ప్రకారం.. ఈ సినిమాని గౌత‌మ్ మీన‌న్ డైరెక్ట్ చేయ‌బోతున్నార‌ని తెలుస్తోంది. సూర్య‌తో కాక్క కాక్క (ఘ‌ర్ష‌ణ చిత్రానికి ఒరిజ‌న‌ల్ వెర్ష‌న్‌), సూర్య స‌న్నాఫ్ కృష్ణ‌న్ వంటి హిట్ చిత్రాల‌ను గౌత‌మ్ తెర‌కెక్కించారు. ముచ్చ‌ట‌గా మూడోసారి రాబోతున్న ఈ సినిమాతో హ్యాట్రిక్ కొడ‌తారేమో చూడాలి.