నాలుగు డిఫరెంట్ లుక్స్‌తో సూర్య
Send us your feedback to audioarticles@vaarta.com
తమిళ స్టార్ హీరో సూర్య వైవిధ్యమైన సినిమాలను చేయడమే కాకుండా.. భిన్నమైన పాత్రలతో, లుక్స్‌తో ప్రయోగాలు చేస్తూ ఉంటారు. తాజా సమాచారం ప్రకారం.. తను నటించే 37వ చిత్రం కోసం కూడా అటువంటి ప్రయోగాన్నే మరోసారి చేయనున్నారని తెలుస్తోంది. ఆ వివరాల్లోకి వెళితే.. సూర్య హీరోగా కె.వి.ఆనంద్ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కబోతోంది. ఈ సినిమాలో సూర్య నాలుగు డిఫరెంట్ లుక్స్‌తో ఆకట్టుకోనున్నారని సమాచారం.
త్వరలోనే చిత్రీకరణ ప్రారంభించుకోనున్న ఈ సినిమాలో కంప్లీట్ యాక్టర్ మోహన్ లాల్ ప్రతినాయకుడిగా నటించనుండగా.. మెగా హీరో అల్లు శిరీష్ ఓ కీలక పాత్రలో కనిపించనున్నాడు. సాయేషా సైగల్ కథానాయికగా నటిస్తోంది. అలాగే.. బాలీవుడ్ నటుడు బోమన్ ఇరాని ఈ సినిమా ద్వారా తమిళ ఇండస్ట్రీకి పరిచయం కానున్నారు. లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ఈ భారీ బడ్జెట్ ఫిల్మ్‌కు హారిస్ జయరాజ్ సంగీతం అందించనున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments