లేడీ డైరెక్టర్ తో సూర్య...

  • IndiaGlitz, [Saturday,July 01 2017]

త‌మిళంలో 'ఇరుదు సుట్రు'(హిందీలో 'సాలా ఖ‌దూస్‌') సినిమాను తెర‌కెక్కించి విజ‌యం అందుకున్న లేడీ డైరెక్ట‌ర్ సుధ కొంగ‌ర‌. ఇప్పుడు హీరో సూర్య‌తో సినిమా చేయ‌డానికి సిద్ధ‌మ‌వుతోంద‌ని స‌మాచారం. రీసెంట్‌గా సూర్య‌ను క‌లిసిన ఈ లేడీ డైరెక్ట‌ర్ క‌థ‌ను చెబితే, సూర్యకు న‌చ్చ‌డంతో సినిమా చేద్దామ‌ని అన్నాడ‌ట‌. అయితే సూర్య ఇప్పుడు విఘ్నేష్ శివ‌న్ ద‌ర్శ‌క‌త్వంలో తానా సెంద కూట్ట‌మ్ సినిమాతో బిజీగా ఉన్నాడు.

ఈ సినిమా పూర్తి కాగానే సుధ కొంగ‌ర సినిమా గురించి ప్ర‌క‌టించే అవ‌కాశం ఉంది. తెలుగుతో పాటు త‌మిళంలో మంచి మార్కెట్ ఉన్న హీరోస్‌లో సూర్య ఒక‌రు. అందుకే సూర్య యూనివ‌ర్స‌ల్ పాయింట్‌తో సినిమా చేయ‌డానికి ఆస‌క్తి చూపిస్తుంటారు. ఇక సుధ కొంగ‌ర విష‌యానికి వ‌స్తే తొలి సినిమా ఇరుదు సుట్రుని బాక్సింగ్ నేప‌థ్యంలో తెర‌కెక్కించింది. మ‌రిప్పుడు ఈమె ఎలాంటి బ్యాక్‌డ్రాప్‌లో సినిమా చేయ‌నుందో. ఇరుదు సుట్రు చిత్రాన్ని వెంక‌టేష్ హీరోగా గురు పేరుతో తెలుగులో రీమేక్ చేశారు. తెలుగులో కూడా సినిమా మంచి విజ‌యాన్నిసాధించింది.