'మేము' ఫస్ట్ లుక్ రిలీజ్ చేసిన సూర్య

  • IndiaGlitz, [Sunday,October 18 2015]

పసంగ, మెరీనా, కేడి బిల్లా-కిలాడి రంగా' వంటి బ్లాక్‌బస్టర్స్‌తో స్టార్‌ డైరెక్టర్‌' ఇమేజ్‌ సొంతం చేసుకొన్న పాండీరాజ్‌ దర్శకత్వంలో.. తమిళ సూపర్‌స్టార్‌ సూర్య నటిస్తూ నిర్మిస్తున్న చిత్రం పసంగ-2. అమలాపాల్‌, బిందుమాధవి హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రం తెలుగు హక్కులు సాయిమణికంఠ క్రియేషన్స్‌ అధినేత జూలకంటి మధుసూదన్‌రెడ్డి సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ చిత్రానికి తెలుగులో మేము' అనే టైటిల్‌ను ఖరారు చేసారు. సూర్య మరియు కె.ఇ.జ్ఞానవేల్‌రాజా ఈ చిత్రాన్ని తెలుగులో సమర్పిస్తున్నారు. ఈ చిత్రం ఆడియో అతి త్వరలో విడుదల కానుండడాన్ని పురస్కరించుకొని.. ఈ చిత్రం ఫస్ట్‌ లుక్‌ను సూపర్‌స్టార్‌ సూర్య రిలీజ్‌ చేసారు.

ఈ సందర్భంగా సూర్య మాట్లాడుతూ .. "నేను తమిళం లో నిర్మిస్తున్న "పసంగ 2* చిత్రాన్ని "మేము" పేరుతో తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నందుకు ఆనందంగా ఉంది ఈ చిత్రంలో నేను పోషిస్తున్న పాత్ర నా కెరీర్ లొనే ఓ కలికితురాయి గా నిలిచిపోతుంది. వరుస విజయాలతో దూసుకుపోతున్న పాండిరాజ్ ఈ చిత్రాన్ని ఎంతో ప్రతిస్థాత్మకంగా తెరకెక్కిస్తున్నాదు" అన్నారు.

సాయిమణికంఠ క్రియేషన్స్‌ అధినేత జూలకంటి మధుసూదన్‌రెడ్డి మాట్లాడుతూ.. సూపర్‌స్టార్‌ సూర్య మరియు కె.ఇ.జ్ఞానవేల్‌రాజా సంయుక్త సమర్పణలో మేము' చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ సినిమా హక్కులు మేం తీసుకొన్నామని తెలిసిన వెంటనే .. జిల్లా' చిత్రంతో సూపర్‌హిట్‌ సొంతం చేసుకొన్న యువ నిర్మాతలు ప్రసాద్‌ సన్నితి-తమటం కుమార్‌రెడ్డి మాతో జత కలిసారు. అక్కినేని నాగేశ్వర్రావుగారు నటించిన ఆఖరి చిత్రం మనం' ఎంతటి గొప్ప చిత్రమో.. మేము' కూడా అంతటి గొప్ప చిత్రమని చెప్పడానికి చాలా గర్వపడుతున్నాం. త్వరలోనే ఆడియో రిలీజ్‌ చేయనున్నాం' అన్నారు.

శశాంక్‌ వెన్నెలకంటి సంభాషణలు సమకూర్చుతున్న ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: బాలసుబ్రమణియం, కూర్పు: ప్రవీణ్‌ కె.ఎల్‌, సంగీతం: అర్రోల్‌ కొర్రెల్ సమర్పణ: సూపర్‌స్టార్‌ సూర్య -కె.ఇ.జ్ఞానవేల్‌రాజా, నిర్మాత: జూలకంటి మధుసూదన్‌రెడ్డి, కథ-స్క్రీన్‌ప్లే-దర్శకత్వం: పాండిరాజ్‌!!

More News

నన్ను మించిన మాస్ డైరెక్టర్ ఉన్నాడా...

గమ్యం చిత్రంతో దర్శకుడిగా పరిచయమై...వేదం,క్రిష్ణం వందేజగద్గురుమ్..చిత్రాలతో మంచి సినిమాల దర్శకుడిగా గుర్తింపు సంపాదించుకున్న డైరెక్టర్ క్రిష్.

ర‌వితేజ ఎన్నాళ్లెన్నాళ్ల‌కు

మాస్ ప్రేక్ష‌కుల‌కు కిక్ ఎక్కించే అంశాల్లో ఒక‌టి ఏమిటంటే.. ఇద్ద‌రు హీరోయిన్స్‌తో క‌లిసి మ‌న హీరో మాంచి హుషారైన సాంగేసుకోవ‌డం. ఇప్పుడు ఇదే ఫార్ములాని మాస్ మ‌హ‌రాజా ర‌వితేజ కూడా అప్ల‌య్ చేస్తున్నాడు

వెండితెర అద్భుతం.. బాహుబ‌లి శ‌త‌దినోత్స‌వం

తెలుగు వారు గ‌ర్వించ‌ద‌గ్గ సంచ‌ల‌న చిత్రం బాహుబ‌లి. ప్ర‌భాస్, రానా, అనుష్క‌, త‌మ‌న్నా...ప్ర‌ధాన పాత్ర‌ల్లో ద‌ర్శ‌క‌థీర రాజ‌మౌళి తెర‌కెక్కించిన బాహుబ‌లి ప్ర‌పంచ వ్యాప్తంగా ఎవ‌రూ ఊహించ‌ని విధంగా దాదాపు 600 కోట్లు పైగా వ‌సూలు చేసి సెన్సేష‌న్ క్రియేట్ చేసింది.

గుజరాత్ లో గబ్బర్ సింగ్...

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా బాబీ తెరకెక్కిస్తున్న చిత్రం సర్ధార్ గబ్బర్ సింగ్.

మీడియాకు సారీ చెప్పిన స‌ర్ధార్

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ స‌ర్ధార్ గ‌బ్బ‌ర్ సింగ్ షూటింగ్ లో బిజీగా ఉన్నారు. ప్ర‌స్తుతం స‌ర్ధార్ గ‌బ్బ‌ర్ సింగ్ షూటింగ్ నాన‌క్ రామ్ గూడ‌లో జ‌రుగుతుంది.