ఆన్ లైన్ సంస్థకు బ్రాండ్ అంబాసిడర్ గా సూర్య...
- IndiaGlitz, [Monday,August 10 2015]
సినిమా స్టార్స్ కి సినిమాల్లోని క్రేజ్ ను కార్పొరేట్ సంస్థలు తమకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం చేస్తుంటాయి. తమిళంతో పాటు తెలుగులో కూడా సూర్యకి మంచి స్టార్ ఇమేజ్ ఉంది. ఆయన ఇమేజ్ ను దృష్టిలో పెట్టుకుని చాలా కార్పొరేట్ సంస్థలు సూర్యను తమ సంస్థలకు బ్రాండ్ అంబాసిడర్ గా ఉపయోగించుకుంటున్నాయి.
తాజాగా ఆన్ లైన్ మార్కెటింగ్ సంస్థ క్విక్కర్ సూర్యను దక్షిణాదిన తమ బ్రాండ్ అంబాసిడర్ గా నియమించుకుంది. అలాగే నార్త్ ఇండియాకి సంబంధించి రణవీర్ సింగ్ ను బ్రాండ్ అంబాసిడర్ గా నియమించుకుంది.