మరోసారి అదే ప్రయత్నం చేయనున్న సూర్య!
Send us your feedback to audioarticles@vaarta.com
హీరో సూర్య నటించిన ‘దేవా, బ్రదర్స్, సూర్య సన్నాఫ్ కృష్ణన్’ చిత్రాలు గుర్తుకు రాగానే మనకు గుర్తుకొచ్చే కామన్ పాయింట్ ఈ చిత్రాల్లో సూర్య డ్యూయెల్ రోల్ చేశాడనే. డ్యూయెల్ రోల్ ఏంటి? ‘24’ చిత్రంలో అయితే ఏకంగా మూడు పాత్రల్లో నటించి మెప్పించాడు సూర్య. ఇప్పుడు ఇలాంటి ప్రయత్నమే సూర్య చేయబోతున్నాడని సినీ వర్గాల సమాచారం. తెలుగు, తమిళ ప్రేక్షకులకు సుపరిచితుడైన హీరో సూర్య త్వరలోనే వెట్రిమారన్ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నాడు. ‘వాడివాసల్’ అనే పేరుతో ఈ సినిమా తెరకెక్కనుంది.
తమిళనాట ఎంతో ప్రాముఖ్యత సంతరించుకున్న జల్లికట్టు నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కనుంది. జల్లికట్టు పోటీల్లో పాల్గొనే ఎద్దులు ఎంట్రీ ఇచ్చే గుమ్మాన్ని వాడివాసల్ అంటారు. తెలుగు టైటిల్ ఇంకా ఖరారు కాలేదు. సీఎస్.చెల్లప్ప అనే రచయిత రాసిన నవల ఆధారంగానే ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారట. ఇందులో తండ్రీ, కొడుకుల పాత్రను హీరో సూర్యనే పోషించబోతున్నాడని టాక్. తండ్రి పాత్రలో సూర్య మరణిస్తుందని అప్పుడు కొడుకు పాత్ర ఏం చేసిందనేదే సినిమా కథాంశమని అంటున్నాయి సినీ వర్గాలు.
ప్రస్తుతం ‘ఆకాశం నీ హద్దురా(శూరరై పోట్రు)’ సినిమాతో త్వరలోనే సూర్య ప్రేక్షకుల ముందుకు రానున్నారు. వెట్రిమారన్ సినిమా తర్వాత హరి దర్శకత్వంలో సూర్య సినిమా చేయాల్సి ఉంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com