త్రివిక్ర‌మ్ నెక్ట్స్ మూవీ స్టార్ట్ అయ్యేది అప్పుడే

  • IndiaGlitz, [Tuesday,December 15 2015]

మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీనివాస్...ప్ర‌స్తుతం హీరో నితిన్ తో అ ఆ సినిమా చేస్తున్నారు. ఈ సినిమాని హారిక అండ్ హాసిని క్రియేష‌న్స్ బ్యాన‌ర్ పై రాథాక్రిష్ణ నిర్మిస్తున్నారు. శ‌రవేగంగా షూటింగ్ జ‌రుపుకుంటున్న ఈ చిత్రాన్ని ఫిబ్ర‌వ‌రిలో రిలీజ్ చేయ‌నున్నారు.

ఈ సినిమా త‌ర్వాత త్రివిక్ర‌మ్...త‌మిళ హీరో సూర్య‌తో ఓ ద్విభాషా చిత్రాన్ని తెర‌కెక్కించ‌నున్నారు. ఈ చిత్రాన్ని కూడా హారిక అండ్ హాసిని క్రియేష‌న్స్ బ్యాన‌ర్ పై రాథాక్రిష్ణ నిర్మిస్తుండ‌డం విశేషం. ప్ర‌స్తుతం సూర్య సింగం 3 సినిమా చేస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ మే కి పూర్త‌వుతుంది. అందుచేత జులై నుంచి త్రివిక్ర‌మ్ సినిమాకి సూర్య డేట్స్ ఇచ్చారు. మ‌రి..సూర్య తో త్రివిక్ర‌మ్ చేసే సినిమాకి ఎలాంటి క‌థాంశాన్ని ఎంచుకున్నార‌నేది ప్ర‌స్తుతానికి స‌స్పెన్స్.