నాగ్ తో పోటీపడుతున్న సూర్య.!

  • IndiaGlitz, [Wednesday,January 25 2017]

న‌వ‌ర‌స స‌మ్రాట్ నాగార్జున న‌టించిన తాజా చిత్రం ఓం న‌మో వేంక‌టేశాయ‌. ఈ భ‌క్తిర‌స చిత్రాన్ని ద‌ర్శ‌కేంద్రుడు రాఘ‌వేంద్ర‌రావు తెర‌కెక్కించారు. సాయికృపా ఎంట‌ర్ టైన్మెంట్ బ్యాన‌ర్ పై మ‌హేష్ రెడ్డి నిర్మించారు. హ‌ధీరామ్ బాబా జీవిత క‌థ ఆధారంగా రూపొందిన ఓం న‌మో వేంక‌టేశాయ చిత్రాన్ని ఫిబ్ర‌వ‌రి 10న ప్ర‌పంచ వ్యాప్తంగా రిలీజ్ చేయ‌నున్నారు.
ఇదిలా ఉంటే...త‌మిళ హీరో సూర్య న‌టించిన తాజా చిత్రం సింగం 3. ఈ చిత్రాన్ని హ‌రి తెర‌కెక్కించారు. స్టూడియో గ్రీన్ బ్యాన‌ర్ పై రూపొందిన ఈ భారీ యాక్ష‌న్ ఎంట‌ర్ టైన‌ర్ ని తెలుగులో నిర్మాత శివ కుమార్ అందిస్తున్నారు. అయితే...ఈ చిత్రం డిసెంబ‌ర్ లో రిలీజ్ కావాలి కుద‌ర‌లేదు. ఆత‌ర్వాత ఈనెల 26న రిలీజ్ చేయాలి అనుకున్నారు అయితే..జ‌ల్లిక‌ట్టు కోసం త‌మిళ‌నాడు యువ‌త చేస్తున్న‌ నిర‌స‌న ఉద్రిక్తంగా మార‌డంతో వాయిదా వేసారు. ఫిబ్ర‌వ‌రి 9న సింగం 3 చిత్రాన్ని రిలీజ్ చేయ‌నున్న‌ట్టు ఈరోజు అఫిషియ‌ల్ గా ఎనౌన్స్ చేసారు. సో...ఒక‌రోజు ముందుగా వ‌చ్చి నాగ్ ఓం న‌మో వేంక‌టేశాయ చిత్రంతో పోటీప‌డుతున్న సూర్య సింగం 3 ఎలాంటి విజ‌యాన్ని సాధిస్తుందో చూడాలి..!